నాగ్‌పూర్: రంజీ చాంపియన్ విదర్భ ప్రతిష్టాత్మక ఇరానీ కప్‌ను కైవసం చేసుకుంది. నాగ్‌పూర్‌లో రెస్టాఫ్ ఇండియాతో జరిగిన ఫైనల్లో ఆ జట్టు 93 పరుగుల తేడాతో గెలిచి ఈ ట్రోఫీని మూడోసారి గెలిచింది. ఆట ఆఖరి రోజు విదర్భ నిర్దేశించిన 361 పరుగుల ఛేదనలో భాగంగా 30/2తో ఐదో రోజు ఆట ఆరంభించిన రెస్టాఫ్ ఇండియా.. 267 రన్స్ వద్దే ఆగిపోయింది.
యశ్ ధుల్ (92), మానవ్ సుతార్ (56*) పోరాడినా మిగిలిన బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కెప్టెన్ రజత్ పాటిదార్ (10)తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (7), అభిమన్యు ఈశ్వరన్ (17) విఫలమయ్యారు. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబే (4/73), యశ్ ఠాకూర్ (2/47), ఆదిత్య థాకరే (2/27) ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడిచేశారు.