టొరంటో: ఫిఫా వరల్డ్‌కప్(FIFA World Cup)లో పోర్చుగల్ స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసింది. రౌండ్32 మ్యాచ్‌లో క్రొయేషియాపై 2-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఓ దశలో ఓటమి అంచున ఉన్న పోర్చుగల్ ఆ తర్వాత చివరి నిమిషాల్లో అనూహ్యంగా తేరుకున్నది. పోర్చుగల్ జట్టు తరపున తొలుత క్రిస్టియానో రోనాల్డో, ఆ తర్వాత గాంకలో రామోస్ గోల్స్ కొట్టడంతో థ్రిల్లింగ్ రీతిలో ఆ జట్టు విజయం సాధించింది. ఆట 94వ నిమిషంలో రామోస్ చేసిన గోల్‌తో పోర్చుగల్ ఊపిరిపోసుకున్నది. వాస్తవానికి తొలి అర్థభాగంలో ఇరు జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే సెకండ్ హాఫ్‌లో క్రొయేషియా అద్భుతమైన గోల్ కొట్టింది. ఆట 53వ నిమిషంలో ఇవాన్ పెరిసిక్ ఆ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు.
మ్యాచ్ దగ్గరపడుతున్న కొద్దీ పోర్చుగల్ క్యాంపులో ఆందోళన మొదలైంది. అయితే ఆట 68వ నిమిషంలో రోనాల్డో పెనాల్టీ షాట్‌తో పోర్చుగల్ బృందంలో ఆశలు రేపాడు. రెండు జట్లు 1-1 గోల్స్ తేడాతో డ్రా దిశగా వెళ్తున్న సమయంలో.. 94 నిమిషంలో మరో అద్భుతం జరిగింది. రామోస్ చేసిన గోల్‌తో పోర్చుల్ రౌండ్16లోకి ఎంట్రీ ఇచ్చింది. రఫేల్ లియో ఇచ్చిన సూపర్ క్రాస్ పాస్‌ను .. రామోస్ స్టన్నింగ్ రీతిలో గోల్‌గా మలిచాడు.
ఎక్స్ట్రా ట్రైంలో ఆ గోల్ రావడంతో 2-1 తేడాతో పోర్చుగల్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే మరో రెండు క్షణాల్లోనే క్రొయేషియా కూడా ఓ గోల్ చేసింది. కానీ వీఏఆర్ ప్రకారం ఆ గోల్‌ను రూలౌట్ చేశారు. జూలై 6వ తేదీన డల్లాస్ స్టేడియంలో జరిగే రౌండ్16లో యురోపియన్ చాంపియన్స్ స్పెయిన్‌తో పోర్చుగల్ పోటీపడనున్నది.