మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మళ్లీ పవారే

భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్ మళ్లీ ఎంపికయ్యాడు. విమెన్స్ క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్‌గా పవార్‌ను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గురువారం ప్రకటించింది. కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తు ఆహ్వానించగా 35 మందికి పైగా పోటీపడ్డారు.
సులక్షణ నాయక్, మదన్ లాల్, రుద్ర ప్రతాప్ సింగ్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూ చేసింది. ఈ కమిటీ పవార్‌ను మళ్లీ కోచ్‌గా ఏకగ్రీవంగా ఎంపికచేసిందని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
పవార్ సారథ్యంలోని భారత మహిళల జట్టు 2018 ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. వరుసగా 14 టీ20 మ్యాచ్‌లను కూడా గెలుచుకుంది. మాజీ క్రికెటర్ రమేశ్ భారత్ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 148 మ్యాచ్‌ల్లో 470 వికెట్లు పడగొట్టడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

