హుస్నాబాద్, ఫిబ్రవరి 12: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పోలీసు శాఖ, రన్నర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన హాఫ్ మారథాన్ పురుషుల విభాగంలో రమేశ్ చంద్ర ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో విజేతగా నిలిచిన రమేశ్ చంద్రకు రూ. 25 వేల నగదు బహుమతి లభించింది. బి. రమేశ్, వేదవ్యాస్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు.
మహిళల విభాగంలో నవ్య, మహేశ్వరి, కామాక్షి టాప్-3 ప్లేస్ల్లో నిలిచారు. 10కే రన్ పురుషుల విభాగంలో లింగన్న చాంపియన్‌గా నిలువగా.. మహిళల విభాగంలో మాలిపల్లి ఉమ అగ్రస్థానం దక్కించుకుంది. విజేతలను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, డీసీపీ మహేందర్, రజితా వెంకట్, రాజిరెడ్డి అభినందించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత హాఫ్ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసి మహిళల్లో స్ఫూర్తినింపారు.