IPL 2025 : ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఇకపై పరువు కోసం ఆడనుంది. వరుస ఓటములతో 9వ స్థానంలో నిలిచిన రాజస్థాన్ సోమవారం గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)ను ఢీకొడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ తీసుకున్నాడు.
వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్.. పరాగ్ సేను ఓడిస్తే ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువకానుంది. ఈ మ్యాచ్‌తో గుజరాత్ ఆల్‌రౌండర్ కరీమ్ జనత్ అరంగేట్రం చేస్తున్నాడు. గాయం నుంచి కోలుకోని సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇరుజట్లు ఇప్పటివరకూ 7 సార్లు తలపడగా.. గుజరాత్ 6 విజయాలతో ఆధిక్యంలో ఉంది.
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీశ్ రానా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రన్ హిట్మైర్, హసరంగ, జోఫ్రా ఆర్చర్, థీక్షణ, సందీప్ శర్మ, యుధ్వీర్ సింగ్.
ఇంప్యాక్ట్ సబ్స్ : శుభమ్ దూబే, కుమార్ కార్తికేయ, అకాశ్ మధ్వాల్, తుషార్ దేశ్‌పాండే, కునాల్ సింగ్.
🚨 Toss 🚨@rajasthanroyals won the toss and opted to field first against @gujarat_titans.
Updates ▶ https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT pic.twitter.com/Es2Tkr64WT
— IndianPremierLeague (@IPL) April 28, 2025
గుజరాత్ తుది జట్టు : సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, కరీం జనత్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
ఇంప్యాక్ట్ సబ్స్ : ఇషాంత్ శర్మ, మహిపాల్ లొమ్రోర్, అనుజ్ రావత్, అర్షద్ ఖాన్, దసున్ శనక.