IPL 2025 : ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) నామమాత్రపు పోరుకు సిద్దమయ్యాయి. ఈ సీజన్లో పేలవమైన ఆటతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి ఇరుజట్లు విజయంతో పరువు కాపాడుకోవాలనే కసితో ఉన్నాయి. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ బౌలింగ్ తీసుకున్నాడు.
ఈ మ్యాచ్‌తో ఇరుజట్లకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. కానీ, కుర్రాళ్లు రికార్డులు బ్రేక్ చేసే అవకాశముంది. సో.. చెన్నైఓపెనర్ ఆయుశ్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్.. రాజస్థాన్ సంచలనం వైభవ్ సూర్యవంశీల బ్యాటింగ్ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత రికార్డులు పరిశీలిస్తే 16-14తో చెన్నైదే ఆధిపత్యం. కానీ, 2022 నుంచి సీఎస్కేపై జోరు చూపించిన రాజస్థాన్ 9 మ్యాచుల్లో 7 సార్లు గెలుపొందింది.
🚨 Toss 🚨 @rajasthanroyals won the toss and elected to field against @ChennaiIPL
Updates ▶️ https://t.co/hKuQlLxjIZ #TATAIPL | #CSKvRR pic.twitter.com/TW5zGgi6SA
— IndianPremierLeague (@IPL) May 20, 2025
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు : ఆయుశ్ మాత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివం దూబే, ఎంస్ ధోనీ(కెప్టెన్, వికెట్ కీపర్), అన్షుల్ కంబోజ్, అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్.
రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్‌మైర్, హసరంగ, క్వెనా మఫాకా, యుధ్వీర్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, అకాశ్ మధ్వాల్.