ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా వాంఖడే మైదానంలో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటి వరకు ఇరుజట్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చివరిగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయాయి. సీజన్ తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించిన కోల్‌కతా ఆ తర్వాత వరుసగా మూడింట్లోనూ పరాజయం పాలైంది. మరోవైపు ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిన రాజస్థాన్ ఆ తర్వాత మ్యాచ్‌లో గెలిచినా.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ మట్టికరిచింది.
కోల్‌కతాపై టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఉనద్కత్, జైశ్వాల్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు కమ్లేశ్ నాగర్కోటి స్థానంలో శివమ్ మావిని జట్టులోకి తీసుకున్నట్లు ఆ జట్టు సారథి ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు.
Match 18. Kolkata Knight Riders XI: N Rana, S Gill, R Tripathi, E Morgan, S Narine, D Karthik, A Russell, P Cummins, S Mavi, V Chakaravarthy, P Krishna https://t.co/AkyLqHRgFW #RRvKKR #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 24, 2021
Match 18. Rajasthan Royals XI: J Buttler, Y Jaiswal, S Samson, S Dube, D Miller, R Parag, R Tewatia, C Morris, J Unadkat, C Sakariya, M Rahman https://t.co/AkyLqHRgFW #RRvKKR #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 24, 2021