ఢిల్లీ : ఐపీఎల్-18లో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్ ఘనంగా ముగించింది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57, 4ఫోర్లు, 4సిక్స్‌లు), శాంసన్ (41), జైస్వాల్ (36) దంచేశారు. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. ఆయుష్ మాత్రె (43), డెవాల్డ్ బ్రెవిస్ (42), శివమ్ దూబె (39) రాణించడంతో 20 ఓవర్లలో 187/8 స్కోరు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ (3/29), యుధ్వీర్ సింగ్ (3/47) రాణించారు. ఛేదనను రాజస్థాన్ ధాటిగానే ఆరంభించింది.
జైస్వాల్ ఆరంభం నుంచే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డా నాలుగో ఓవర్లో అన్షుల్ అతడిని క్లీన్‌బౌల్డ్ చేసి చెన్నైకి తొలి బ్రేక్ ఇచ్చాడు. కానీ అతడి స్థానంలో వచ్చిన సారథి శాంసన్, కుర్రాడు సూర్యవంశీ చెన్నై బౌలర్లను ఆటాడుకున్నారు. ఇద్దరూ రెండో వికెట్‌కు 58 బంతుల్లో 98 పరుగులు జోడించారు. కానీ ఈ ఇద్దరూ నాలుగు బంతుల వ్యవధిలోనే నిష్క్రమించినా..ధృవ్ జురెల్(12 బంతుల్లో 31 నాటౌట్, 2ఫోర్లు, 3సిక్స్‌లు)ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. చెన్నై బౌలర్లను ఉతికి ఆరేస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. హెట్‌మైర్(12 నాటౌట్) జతగా రాజస్థాన్‌కు జురెల్ ఘన విజయాన్ని కట్టబెట్టాడు. అశ్విన్(2/41)కు రెండు వికెట్లు దక్కాయి.