జైపూర్: శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర మరోసారి హెడ్‌కోచ్ బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే సీజన్ నుంచి అతడు రాజస్థాన్ రాయల్స్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. 2021 నుంచి 2024 దాకా ఆ బాధ్యతల్ని మోసిన సంగక్కర.. నిరుడు రాహుల్ ద్రావిడ్‌కు కోచ్‌గా నియమితుడవడంతో ఆ స్థానం నుంచి తప్పుకున్నాడు.
దీంతో రాజస్థాన్ అతడిని డైరక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ప్రమోట్ చేసింది. కానీ ఈ ఏడాది ద్రావిడ్.. రాయల్స్‌కు గుడ్ బై చెప్పడంతో మళ్లీ ఆ జట్టు సంగాకే బాధ్యతలు అప్పజెప్పింది. అతడి కోచింగ్ సిబ్బందిలో విక్రమ్ రాథోడ్, ట్రెవర్ పెన్నే, సిద్ లాహిరి, షేన్ బాండ్ ఉన్నారు.