Rajasthan Royals : ఐపీఎల్లో బిగ్గెస్ట్ ట్రేడ్డీల్లో సంజూ శాంసన్ (Sanju Samson)ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఏడేళ్లుగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)తో కొనసాగిన సంజూ ఇప్పుడు చెన్నై జెర్సీతో మైదానంలోకి దిగనున్నాడు. సంజూ రాజస్థాన్‌కు గుడ్ బై చెప్పడానికి కారణాలు లేకపోలేదు. కొన్ని సీజన్లుగా జట్టు ప్రదర్శన ఆశించినతంగా లేకపోవడంతో నిరాశచెందిన శాంసన్.. కొత్త ఫ్రాంచైజీకి ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. తమ జట్టుకు పద్నాలుగేళ్లు ఆడిన శాంసన్‌ను వదిలేయడంపై రాజస్థాన్ యజమాని మనోజ్ బడలే(Manoj Badale) ఏం చెప్పాడంటే..?
‘ఈ ఏడాది.. అంతకంటే ముందు నుంచి కూడా శాంసన్ తాను జట్టు మారాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. అతడలా మాతో చెప్పగానే అందరం షాకయ్యాం. టీమ్ మేనేజ్మెంట్ సమావేశమై చర్చించాం. సంజూ చాలా నిజాయతీపరుడు. కానీ, అతడు వ్యక్తిగతంగా డల్‌గా కనిపించాడు. రాజస్థాన్ ఫ్రాంచైజీ అంటే అతడికి చాలా ఇష్టం, గౌరవం. గత పద్దెనిమిది సీజనల్లో ఒకస్కారి కూడా విజేతగా నిలవకపోవడం కూడా సంజూలో మార్పు తెచ్చింది. పద్నాలుగేళ్లు అతడు రాజస్థాన్‌కు విశేష సేవలందించాడు. ఐపీఎల్లో అతడు కొత్త జర్నీ చేయాలనుకుంటున్నాడు. ఇన్నాళ్లు రాజస్థాన్ అభిమానులు అతడి ఆటలను, సిక్సర్లును ఎంతో ఎంజాయ్ చేశారు’ అని తెలిపాడు.
Rajasthan Royals briefly posted a video of owner Manoj Badale discussing all the behind-the-scenes trade rumours… and deleted it immediately 👀
Sanju Samson had actually decided to leave RR last year, and Jadeja himself reached out to say he was excited to join the RR
PFB SS pic.twitter.com/eceK6g5P0b
— Sanju Samson Fans Page (@SanjuSamsonFP) November 15, 2025
తొలిసారి 2013లో రాజస్థాన్‌కు ఆడిన శాంసన్ 2015 తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లాడు. అక్కడ మూడు సీజన్లు ఆడిన అతడు మళ్లీ 2018లో రాజస్థాన్ గూటికి చేరాడు. 2021లో కెప్టెన్సీ చేపట్టిన సంజూ మరసటి ఏడాదే జట్టును ఫైనల్ చేర్చాడు. కానీ, టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. పద్దెనిమిదో సీజన్లో గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన అతడు.. తిరిగి వచ్చేసరికి ప్లే ఆఫ్స్ రేసులో రాజస్థాన్ లేదు.
You walked in as a young boy in Blue. Today, we bid goodbye to a Captain, Leader, our Chetta.
Thank you for everything, Sanju Samson 💗 pic.twitter.com/TC7MHeT6e9
— Rajasthan Royals (@rajasthanroyals) November 15, 2025
పైగా రియాన్ పరాగ్ సారథిగా రాణించడం, యశస్వీకి జతగా వైభవ్ సూర్యవంశీ రూపంలో డేంజరస్ ఓపెనర్ దొరకడంతో సంజూ జట్టు మారడమే శరణ్యం అనుకున్నాడు. ఐపీఎల్ 18వ సీజన్ ముగియగానే అతడు సీఎస్కేకు అనుకూలంగా పోస్ట్‌లు పెట్టాడు. దాంతో.. వచ్చే ఏడాది సంజూ చెన్నైకి ఆడడం ఖాయమనుకున్నారంతా. అనుకున్నట్టే ట్రేడ్ డీల్ ద్వారా చెన్నై అతడిని కొనేసింది.
Sanju Samson, after a long and memorable stint with Rajasthan Royals, will now play for Chennai Super Kings. 💛🔥#IPL2026 #CSK #SanjuSamson #Sportskeeda pic.twitter.com/drlQfNpuSQ
— Sportskeeda (@Sportskeeda) November 15, 2025