PBKS vs RR | హెట్‌మైర్ విధ్వంసం.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ అద్భుత విజయం
PBKS vs RR : పదిహేడో సీజన్లో మరో ఆఖరి ఉత్కంఠ పోరు. బౌలర్ల జోరుతో స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ. 147 పరుగుల ఛేదనలో తడబడిన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) అద్భుత విజయం సాధించింది.
PBKS vs RR : పదిహేడో సీజన్లో మరో ఆఖరి ఉత్కంఠ పోరు. బౌలర్ల జోరుతో స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ. 147 పరుగుల ఛేదనలో తడబడిన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) అద్భుత విజయం సాధించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(39) మెరుపులకు విండీస్ వీరుడు హెట్‌మైర్(27 నాటౌట్) విధ్వసం తోడవ్వడంతో రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. పంజాబ్ బౌలర్లలో రబడ, సామ్ కరన్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
స్వల్ప ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు తనుష్ కొటియాన్(18), యశస్వీ జైస్వాల్(23)తొలి వికెట్‌కు 56 రన్స్ జోడించారు. అయితే.. పంజాబ్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బౌండరీలు రావడం గగమనమైంది.
Hetmyer the HERO for @rajasthanroyals 💗
The visitors release the pressure with only 11 off 8 required now!
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #PBKSvRR pic.twitter.com/5Dw5TQ7Q9V
— IndianPremierLeague (@IPL) April 13, 2024
డాట్ బాల్స్‌తో ఒత్తిడికి లోనైన తనుష్ షాట్ ఆడి చిక్కాడు. ఆ కాసేపటికే రబడ డేంజరస్ యశస్వీని బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన శాంసన్()ను సైతం ఎల్బీగా వెనక్కి పంపి పంజాబ్‌ను పోటీలోకి తెచ్చాడు. అప్పటికీ రాజస్థాన్ విజయానికి 56 పరుగులు కావాలి. గత మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీ బాదిన రియాన్ పరాగ్(23) ధనాధన్ ఆడాడు.
Hetmyer the HERO for @rajasthanroyals 💗
The visitors release the pressure with only 11 off 8 required now!
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #PBKSvRR pic.twitter.com/5Dw5TQ7Q9V
— IndianPremierLeague (@IPL) April 13, 2024
అయితే.. అర్ష్‌దీప్ స్లో డెలివరీకి పరాగ్ భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద రబడ చేతికి చిక్కాడు. గెలిపిస్తారనుకున్న ధ్రువ్ జురెల్(6)తో కలిసి పొవెల్(11)లు నిరాశపరిచారు. అయినా హెట్‌మైర్ ఉన్నాడనే భరోసాతో రాజస్థాన్ ఉంది. అర్ష్‌దీప్ వేసిన ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. రెండు డాట్ బాల్స్. మూడో బంతికి హెట్‌మైర్(27 నాటౌట్) సిక్సర్ కొట్టాడు. అదే జోష్‌లో ఐదో బంతిని స్టాడ్స్లోకి పంపాడు. అంతే.. రాజస్థాన్ డగౌట్లో సంబురాలు మొదలయ్యాయి.
అశుతోష్ శర్మ(31)

కెప్టెన్ శిఖర్ ధావన్ లేకుండా బరిలోకి దిగిన పంజాబ్ తొలుత 147 రన్స్ కొట్టింది. టాపార్డర్ బ్యాటర్లంతా నిలకడలేమిని చాటుకోగా కెప్టెన్ సామ్ కరన్(11), గత రెండు మ్యాచుల్లో చెలరేగిన శశాంక్ సింగ్(9)లు సైతం విఫలమయ్యారు. దాంతో, పంజాబ్ 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో వికెట్ కీపర్ జితేశ్ శర్మ(29), లివింగ్‌స్టోన్(21)లు ఆరో వికెట్‌కు 33 రన్స్ జోడించారు. ఇక ఎప్పటిలానే ఇంప్యాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ(31: 16 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సర్లు) ఆఖర్లో మెరుపులు మెరిపించడంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. సామ్ కరన్ సేన నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 రన్స్ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో కేశవ్ మహరా(23/2), అవేవ్ ఖాన్(34/2)లు రాణించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

