Rajasthan Royals : ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్లో దారుణ ప్రదర్శన.. ఆపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) రాజీనామాతో షాక్ తిన్న రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కొత్త కోచ్‌ను ఖరారు చేసింది. గతంలో మూడు సీజన్లు సేవలందించిన కుమార సంగక్కర (Kumara Sangakkara)కు ప్రధాన కోచ్‌గా నియమించింది. ద్రవిడ్ వైదొలిగినప్పటి నుంచి తదుపరి కోచ్‌గా ఈ శ్రీలంక లెజెండ్ వేరు వినించింది. ఊహించినట్టే సోమవారం అతడిని కోచ్‌గా తీసుకుంది రాజస్థాన్. డైర్టెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా.. కోచ్‌గా రెండు బాధ్యతల్ని సంగక్కరకే అప్పగించింది రాజస్థాన్ యాజమాన్యం.
రాజస్థాన్‌తో సంగక్కరకు మంచి అనుబంధముంది. 2021లో ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అతడు.. 2024 వరకూ కొనసాగాడు. సంగక్కర నేతృత్వంలో మెరుగైన ప్రదర్శన చేసిన రాజస్థాన్ 2022 ఫైనల్ ఆడింది. ఆ తర్వాత పదిహేడో సీజన్లో ప్లే ఆఫ్స్ చేరింది. దాంతో.. మళ్లీ అతడినే కోచ్‌గా నియమించాలని రాజస్థాన్ యాజమాన్యం భావించింది. ఇదే విషయాన్ని రాజస్థాన్ యజమాని మనోజ్ బడలే (Manoj Badale) ఫ్రాంచైజీ ఎక్స్ పోస్ట్‌లో తెలిపాడు. ‘పద్దెనిమిదో సీజన్లో రాజస్థాన్ పేలవ ప్రదర్శన దృష్ట్యా.. జట్టును గాడీలో పెట్టగల కోచ్ అవసరం.
JUST IN: Kumar Sangakkara has been re-appointed as Rajasthan Royals’ head coach. He will also continue in his role as director of cricket at the franchise pic.twitter.com/qb3YcJqqBB
— ESPNcricinfo (@ESPNcricinfo) November 17, 2025
స్క్వాడ్ గురించి అవగాహన ఉన్న సంగక్కరనే కోచ్‌గా తీసుకోవాలనుకున్నాం. నాయకత్వ లక్షణాలే కాదు రాజస్థాన్ ఫ్రాంచైజీ సంస్కృతి గురించి బాగా తెలిసిన అతడే జట్టును మునపటిలా నడిపించగలడు. నాయకుడిగా అతడిపై మాకు సంపూర్ణ మద్దతు ఉంది. అతడి ప్రశాంతత, అతడికి ఉన్న స్పష్టత, క్రికెట్ పరిజ్ఞానం రాజస్థాన్‌ను ఎంతో ఉపయోగపడుతాయి’ అని రాజస్థాన్ యజమాని మనోజ్ బడలే వెల్లడించాడు.
🚨 Official: Director of Cricket Kumar Sangakkara will also take charge as Head Coach for IPL 2026 pic.twitter.com/4IRWoQM3mj
— Rajasthan Royals (@rajasthanroyals) November 17, 2025
హెడ్‌కోచ్‌గా మళ్లీ వస్తున్న సంగక్కరకు తొలి సవాల్ కెప్టెన్ ఎంపికతో మొదలవ్వనుంది. నాలుగేళ్లు జట్టును నడిపించిన సంజూ శాంసన్ ఫ్రాంచైజీని వీడడంతో కాబోయే సారథి ఎవరు? అనేది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఓపెనర్, పవర్ హిట్టర్ అయిన సంజూను ట్రేడ్ డీల్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు అమ్మేసి రవీంద్ర జడేజా (Ravindra Jadena)ను కొన్న రాజస్థాన్.. ఎవరికి కెప్టెన్సీ ఇస్తుంది? అనేది తెలియాల్సి ఉంది. జడ్డూకు పగ్గాలు అప్పగిస్తారా? లేదా అట్టిపెట్టుకున్న వాళ్లలోని ఒకరికి ఓటేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. 18వ సీజన్లో సంజూ గైర్వాహజరీలో రియాన్ పరాగ్ ఆకట్టుకున్నాడు. దాంతో.. అతడివైపు యాజమాన్యం, కోచ్ సంగక్కర మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. అయితే.. కెప్టెన్సీ రేసులో యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంగక్కర ఎవరిని కెప్టెన్‌గా సిఫారసు చేస్తాడో చూడాలి.
24 hours of Jaddu being a Rajasthani Royal 🔥❤️🔥 pic.twitter.com/1JtAqlIBuF
— Rajasthan Royals (@rajasthanroyals) November 16, 2025
రాజస్థాన్ కోచింగ్ సిబ్బంది విషయానికొస్తే.. టీమిండియా మాజీ కోచ్ విక్రమ్ రాథోడ్ అసిస్టెంట్ కోచ్‌గా కొనసాగనున్నాడు. బౌలింగ్ కోచ్‌గా షేన్ బాండ్ సేవల్ని యాజమాన్యం ఉపయోగించుకోనుంది. అలానే సంగక్కర హయాంలో సపోర్టింగ్ స్టాఫ్‌గా ఉన్న ట్రెవర్ పెన్నీ, సిద్ధార్థ లహిరి తిరిగి జట్టుతో కలిసే అవకాశముంది. క్రిక్‌బజ్ కథనం ప్రకారం పద్దెనిమిదో సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రదర్శన పట్ల ఫ్రాంచైజీ అంసతృప్తితో ఉంది. 14 మ్యాచుల్లే కేవలం నాలుగంటే నాలుగు విజయాలకే పరిమితం కావడంతో ఆగ్రహించిన యాజమాన్యం.. కోచింగ్ సిబ్బందిలో మార్పులకు శ్రీకారం చుట్టాలనుకుంది. అందుకని ప్రధాన కోచ్ ద్రవిడ్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలని చూడగా.. అతడు వద్దు నేను కొనసాగలేనంటూ ఫ్రాంచైజీకి షాకిచ్చాడు.
Trades ✅
Retentions ✅
Auction ⏳ pic.twitter.com/jGR83dnFuf— Rajasthan Royals (@rajasthanroyals) November 16, 2025