ముంబై: క్రికెట్లో నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకొని వింత బౌలింగ్ యాక్షన్లతో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించే బౌలర్లు చాలా మంది ఉంటారు. కొందరు కావాలని అప్పటికప్పడు తమ యాక్షన్ మార్చి బ్యాట్స్‌మెన్‌ని గందరగోళానికి గురి చేస్తారు. ఐపీఎల్లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ రియాన్ పరాగ్ కూడా ఇదే ఎత్తుగడ వేశాడు.
పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు పరాగ్ వింత యాక్షన్‌తో బౌలింగ్ చేశాడు. తన శరీరానికి చేతిని 90 డిగ్రీల కోణంలో తిప్పుతూ బాల్ విసరడం విశేషం. ఈ బౌలింగ్ యాక్షన్ అటు ఐపీఎల్ నిర్వాహకులను, ఇటు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ రైట్ ఆర్మ్ పర్పెండిక్యులర్కు మీరు ఏం పెడతారంటూ ఐపీఎల్ తన ట్విటర్లో ఫ్యాన్స్‌ను ప్రశ్నించింది.
ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్ వేసిన పరాగ్.. గేల్ వికెట్ తీయడం విశేషం. పరాగ్ వేసిన ఆ బాల్ నుంచి తప్పించుకున్నా.. అదే ఓవర్లో గేల్ అవుటయ్యాడు. పరాగ్ తనకు తానే నోబాల్ ఇచ్చుకున్నాడని ఒకరు, డ్యాన్స్ చేస్తూ గేల్‌ను అవుట్ చేశాడని మరొకరు ఈ బౌలింగ్ యాక్షన్‌పై కామెంట్ చేశారు.
That is right-arm perpendicular. What name can you think of for this unique action? #RRvPBKS #VIVOIPL pic.twitter.com/lTYuL6Xl4r
— IndianPremierLeague (@IPL) April 12, 2021
ఇవి కూడా చదవండి
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్
పది లక్షల టన్నుల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వృథా నీళ్లు సముద్రంలోకి!
ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ
లంగా ఓణీలో మెరిసిపోతున్న శ్రీముఖి
ఉగాది స్పెషల్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ విడుదల