World Cup Final : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో సరికొత్త అధ్యాయానికి నాంది పడనుంది. దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను తోసిరాజని కొత్త ఛాంపియన్ అవతరించనుంది. ఆ ‘కొత్త విజేత ఎవరు?’ అని యావత్ క్రీడాభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఆదివారం ముంబైలోని డీవై పాటిల్ మైదానం(DY Patil Stadium)లో టైటిల్ పోరు జరుగనుంది. ఇరుజట్లలో ఎవరు గెలిచినా చరిత్ర సృష్టించడం ఖాయం.
సఫారీలకు ఇది తొలి ఫైనల్ కాగా.. టీమిండియాకు మూడోది. రెండుపర్యాయాలు (2005, 2017లో) ఆఖరి మెట్టుపై తడబడిన భారత్ ఈసారి ఎలాగైనా కప్‌ను ఒడిసిపట్టాలనే పట్టుదలతో ఉంది. అయితే.. ఈ బిగ్ ఫైట్‌కు అనుకోని అతిథి వరుణుడు అంతరాయం కలిగించే అవకాశముంది. దాంతో.. 50 ఓవర్ల మ్యాచ్‌పై సందేహాలు నెలకొన్నాయి.
Who’s going to be on top of the world after Sunday’s final? #CWC25 pic.twitter.com/5ngnyi9HI6
— ESPNcricinfo (@ESPNcricinfo) November 1, 2025
ప్రపంచకప్ ట్రోఫీ నిరీక్షణకు తెరదించేందుకు ఎదురుచూస్తున్న భారత్, దక్షిణాఫ్రికా జట్లకు వర్షం షాకిచ్చేలా ఉంది. ఇప్పటికే లీగ్ దశ మ్యాచ్‌లకు పలు దఫాలు అంతరాయం కలిగించి.. కొన్ని మ్యాచ్‌లను రద్దు చేయించిన వరుణుడు.. ఫైనల్ రోజైన ఆదివారం కూడా రెఢీగా ఉన్నాడు. ముంబైలో ఆరోజు పడేందుకు 25 శాతం అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి 8 గంటల వరకూ కూడా వర్ష సూచన 20 శాతంగా ఉందని హెచ్చరించింది. దాంతో.. అంతరాయం కారణంగా కోల్పోయిన సమయాన్ని బట్టి ఓవర్లలో కోత విధించడం వంటివి అంపైర్లు పరిశీలిస్తారు. ఒకవేశ వర్షం కారణంగా 20 ఓవర్ల ఆట అయినా ఆడిస్తారు. అది కూడా సాధ్యం కాకుంటే రిజర్వ్ డేన ఫైనల్ ఆడిస్తారు.
లీగ్ దశలో వైజాగ్ వేదికగా భారత జట్టుకు షాకిచ్చింది లారా వొల్వార్డ్త్ బృందం. ఛేదనలో కీలక వికెట్లు పడినా.. డీక్లెర్క్ (84 నాటౌట్) మెరుపులతో మూడు వికెట్ల విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇరుజట్ల మధ్య ఫైనల్ ఫైట్ జరుగుతుండడంతో గెలుపు ఎవరిది? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. అయితే.. వన్డే ఫార్మాట్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటివరకూ 34 మ్యాచుల్లో భారత్ 20 విజయాలు సాధించగా.. సఫారీ టీమ్ 13కే పరిమితమైంది. కానీ, ఫైనల్లో ఒత్తిడికి లోనవ్వకుండా ఆడిన జట్టుకే గెలుపొందే అవకాశాలెక్కువ.
Special performances on the biggest of stages 🔝👉
𝙍𝙤𝙖𝙙 𝙩𝙤 𝙁𝙞𝙣𝙖𝙡, ft. #TeamIndia 🇮🇳#WomenInBlue | #CWC25 | #Final | #INDvSA pic.twitter.com/tYm1QntWuE
— BCCI Women (@BCCIWomen) November 1, 2025
నాకౌట్ పోరులో ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని చేరుకున్న టీమిండియా ఆత్మవిశ్వాసంతో ఉంది. ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ ఫామ్ కలిసిరానుంది. బౌలింగ్‌లో శ్రీచరణి.. క్రాంతి గౌడ్‌తో పాటు రేణుకా, దీప్తి శర్మ రాణించాల్సి ఉంది. ఇక ఇంగ్లండ్‌పై విధ్వంసక శతకం బాదిన సఫారీ కెప్టెన్ లారా సూపర్ ఫామ్‌లో ఉంది. మిడిల్ ఓవర్లలో దంచేసే ట్రయాన్, మరిజానే కాప్, ఫినిషర్ డీక్లెర్క్ ఆ జట్టు బ్యాటింగ్‌కు అతిపెద్ద బలం. బౌలింగ్‌లో కాప్ ఇంగ్లండ్‌పై ఐదు వికెట్లతో చెలరేగింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మ్లాబా, ట్రయాన్లు భారత బ్యాటర్లను ఇరుకునపెట్టగలరు.
Nadine de Klerk = clutch 🥶 #CWC25 pic.twitter.com/Mj4UUnX1x5
— ESPNcricinfo (@ESPNcricinfo) October 13, 2025