IND vs ENG : భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం (Rain) అడ్డుపడేలా ఉంది. డర్హంలో తొలి పోరు వర్షార్పణమవ్వగా.. మాంచెస్టర్‌లో శనివారం జరగాల్సిన మ్యాచ్‌కు సైతం అంతరాయం తప్పేలా లేదు. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ గేమ్‌కు వర్ష సూచన ఉంది. ఉదయం నుంచి వచ్చిపోతున్న వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించేలా ఉన్నాడు. ఈ నేపథ్యంలో యువ కెరటం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అరంగేట్రంపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నట్టే అనిపిస్తోంది.
ఐర్లాండ్‌పై 2-0తో పొట్టి సిరీస్ చేజార్చుకున్న భారత జట్టును ఇంగ్లండ్ పర్యటనలో వరుణుడు వెంటాడుతున్నాడు. టీ20 సిరీస్ ఆరంభ పోరులో విజయంతో ఊపిరి పీల్చుకోవాలనుకుంటున్న టీమిండియాకు షాకిచ్చిన వర్షం.. రెండో మ్యాచ్‌కూ అడ్డుపడేలా ఉంది.
Rain threat looms over Manchester during the 2nd T20I between England and India 🌧
(Via BBC Weather)#ENGvIND #ShreyasIyer #HarryBrook #Manchester #CricketTwitter pic.twitter.com/RKyIryNSQR
— InsideSport (@InsideSportIND) July 4, 2026
మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో శనివారం రాత్రి 7:00 గంటలకు జరగాల్సని మ్యాచ్‌కు వాన ముప్పు ఉందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం నుంచి దశలవారీగా పడుతున్న వాన.. భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లతో దోబూచులాడుతోంది. తీరా.. టాస్ సమయానికి లేదా మ్యాచ్ మధ్యలో వర్షం అందుకుంటే ఎలా? అని ఇరుజట్లు అందోళన చెందుతున్నాయి.

ముఖ్యంగా.. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20ల్లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడనే వార్తలు వినిపిస్తున్న వేళ అందరిలో ఉత్కంఠ నెలకొంది. కొత్త అధ్యాయం మొదలవ్వనుంది అంటూ వైభవ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అతడికి తుది జట్టులో చోటు ఖాయమని అనుకుంటున్నారంతా. కానీ, వాతావరణం మాత్రం ప్రతికూలంగా ఉండడంతో.. ఒకవేళ వైభవ్‌ను ఆడించినా అతడి మెరుపులను చూస్తామా? లేదా? అనేది అభిమానులను కలవరపెడుతోంది.
ఐర్లాండ్ పర్యటనలో, ఆపై ఇంగ్లండ్ గడ్డమీద తొలి టీ20లో సంజూ శాంసన్, తిలక్ వర్మ విఫలమైనందున వీరిలో ఒకరిని బెంచ్‌పై కూర్చోబెడతారనే చర్చ జోరందుకుంది. అదే జరిగితే యువకెరటం వైభవ్ 15 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం ఖాయం.