PAKW vs SAW : వరల్డ్ కప్‌లో బోణీ కోసం నిరీక్షిస్తున్న పాకిస్థాన్ భారీ ఛేదనలో తడబడుతోంది. ప్రేమదాస స్టేడియంలో దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి 4 వికెట్లు కోల్పోయిన పాక్‌ను వర్షం ఆదుకున్నాడు. మరినే కాప్ (3-20) విజృంభణతో.. క్రీజులో నిలిచేందుకు అపసోపాలు పడుతున్న పాక్ బ్యాటర్లకు బ్రేకిస్తూ వరుణుడు మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. అప్పటికి పది ఓవర్లు పూర్తికాగా పాక్ స్కోర్. 35-4. ఆట నిలిపివేసే సరికి సిద్రా నవాజ్(0), నటాలియా పర్వేజ్(1)లు అజేయంగా ఉన్నారు.
దక్షిణాఫ్రికా బ్యాటర్ల విధ్వంసంతో డీలా పడిన పాకిస్థాన్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మునీబా అలీ(5)ని పేసర్ ఖాకా ఔట్ చేసి తొలి బ్రేకిచ్చింది. ఆరంభంలోనే వికెట్ పడడంతో సిద్రా అమిన్ (13), ఒమైమా సోహైల్ (6) జాగ్రత్తగా ఆడారు. కాస్త కుదురుకున్నాక సిద్రా ఫోర్లతో అలరించింది.
𝟐 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐨𝐯𝐞𝐫 𝐟𝐨𝐫 𝐌𝐚𝐫𝐢𝐳𝐚𝐧𝐧𝐞 𝐊𝐚𝐩𝐩!! 🔥
Sidra Amin falls for 13, Pakistan in early trouble at 32/3 (7)! 👀#CricketTwitter #CWC25 #PAKvSA pic.twitter.com/pkBGOxXfOD
— Female Cricket (@imfemalecricket) October 21, 2025
అయితే.. 7వ ఓవర్లో మరినే కాప్ రెండు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టింది. మొదటగా సొహైల్‌ను ఎల్బీగా ఔట్ చేసిన తను.. చివరి బంతిని సిద్రాను డగౌట్ చేర్చింది. మరోసారి తన ప్రతాపం చూపిస్తూ అలియా రియాజ్(3)ను ఔట్ చేసిన కాప్ పాక్‌ను కష్టాల్లోకి నెట్టింది. నాలుగు వికెట్లు పడిన పాక్ జట్టు ఇక కోలుకోవడం కష్టమే అనుకున్నవేళ.. వర్షం మొదలైంది. లక్ష్యాన్ని 299కి కుదించారు. ఇంకా పాక్ విజయానికి 264 పరుగులు కావాలి.