IPL 2025 : రుతుపవనాల రాకతో ఐపీఎల్ మ్యాచ్‌లకు వర్షం ముప్పు ఉందన్నది వాస్తవమే. పునరుద్ధరణ తర్వాతి రెండు లీగ్ మ్యాచ్‌లు రద్దుకాగా ప్లే ఆఫ్స్‌కు కూడా వరుణుడు అడ్డు పడుతున్నాడు. ఆదివారం అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ వేదికగా షెడ్యూల్ ప్రకారం 7:30కి మొదలు కావాల్సిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఆసల్యంకానుంది. టాస్ వేసిన కాసేపటికే మైదానంలో చినుకులు మొదలయ్యాయి. దాంతో, సిబ్బంది పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పేశారు. జల్లులు కాస్త పెద్దగా పడుతుండంతో ఇరుజట్ల ఆటగాళ్లు డగౌట్లో ఉండిపోయారు. అటువైపు అభిమానులు కూడా వాన త్వరగా ఆగిపోవాలని కోరుకుంటున్నారు.
అయితే.. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేను ప్రకటించలేదు. దాంతో, ఈ మ్యాచ్ రద్దయితే.. ఫైనల్‌కు వెళ్లేది ఎవరంటే.. పంజాబ్ కింగ్స్. ముంబై కంటే 3 పాయింట్లు ఎక్కువున్న అయ్యర్ సేన టైటిల్ పోరుకు అర్హత సాధించనుంది. అయితే.. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు అదనంగా మరో గంట అంటే.. మొత్తంగా 2 గంటల అదనపు సమయం ఉండనే ఉంది. సో.. కనీసం 10 లేదంటే 5 ఓవర్ల ఆట అయినా సాధ్యం అవుతుందిలే అని ఇరుజట్ల ఆటగాళ్లే కాదు అభిమానులూ అనుకుంటున్నారు.
🚨 Update 🚨
Start of play delayed due to rain.
Stay tuned for further updates ▶ https://t.co/vIzPVlDqoC#TATAIPL | #PBKSvMI | #Qualifier2 | #TheLastMile pic.twitter.com/U36OmiVeZ2
— IndianPremierLeague (@IPL) June 1, 2025
ముంబై తుది జట్టు : రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధిర్, మిచెల్ శాంట్నర్, రాజ్ బవ, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, రీసే టాప్లే.
ఇంప్యాక్ట్ సబ్స్ : అశ్వనీ కుమార్, క్రిష్ణన్ శివర్జిత్, రఘు శర్మ, రాబిన్ మింజ్, బెవొన్ జాకొబ్.
పంజాబ్ తుది జట్టు : ప్రియాన్ష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నేహల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైలీ జేమీసన్, విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్.
ఇంప్యాక్ట్ సబ్స్ : ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాన్ష్ షెడ్గే, గ్జావియర్ బార్ట్లెట్, హర్‌ప్రీత్ బ్రార్.