INDW VS BANW | భారత ఓపెనర్ల జోరుకు అడ్డుపడిన వాన.. స్కోర్ ఎంతంటే..?
INDW VS BANW : బంగ్లాదేశ్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో దంచేస్తున్న భారత ఓపెనర్ల జోరుకు వర్షం అడ్డుపడింది. 9వ ఓవర్ మధ్యలోనే వాన అందుకోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు.
INDW VS BANW : డీవై పాటిల్ స్టేడియంలో వర్షం దోబూచులాడుతోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు రెండు దఫాలు అంతరాయం కలిగించిన వాన.. ఇప్పుడు భారత బ్యాటర్ల ఉత్సాహంపై నీల్లు చల్లింది. స్వల్ప ఛేదనలో దంచేస్తున్న భారత ఓపెనర్ల జోరుకు బ్రేకులు వేస్తూ.. స్టేడియంలో నీళ్లు కుమ్మరిస్తున్నాడు వరుణుడు. 9వ ఓవర్ మధ్యలోనే వాన అందుకోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికి టీమిండియా స్కోర్.. 57-0. ఆట నిలిచే సరికి ఓపెనర్లు స్మృతి మంధాన(34 నాటౌట్), అమన్‌జోత్ కౌర్(15 నాటౌట్)లు అజేయంగా క్రీజులో ఉన్నారు. ఇంకా భారత జట్టు విజయానికి 69 పరుగులు కావాలంతే.
డక్‌వర్త్ లూయిస్ ప్రకారం భారత జట్టు లక్ష్యాన్ని 126గా నిర్ణయించారు. స్వల్ప ఛేదనలో తొలి రెండు ఓవర్లలో ఆరు పరుగులే వచ్చాయి. అయితే.. నాలుగో ఓవర్లో గేర్ మార్చిన స్మృతి మంధాన(34 నాటౌట్) బంగ్లా స్పిన్నర్ నిశితా అక్తర్‌కు చుక్కలు చూపించింది. ఫ్రంట్‌ఫుట్, బ్యాక్‌ఫుట్ షాట్లు ఆడిన తను ఏకంగా నాలుగు ఫోర్లతో రెచ్చిపోయింది.
Smriti Mandhana 🤝 Amanjot Kaur
A solid 5⃣0⃣-run opening stand 👌
Updates ▶️ https://t.co/lkuocSlGGJ#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvBAN | @mandhana_smriti pic.twitter.com/yCTrscO2WJ
— BCCI Women (@BCCIWomen) October 26, 2025
మంధాన జోరుతో ఆ ఓవర్లో16 రన్స్ రాగా.. పవర్ ప్లే చివరి ఓవర్లోనూ బౌండరీ కొట్టడంతో స్కోర్ 38కి చేరింది. ప్రతీకా రావల్ గాయపడడంతో ఓపెనర్‌గా వచ్చిన అమన్‌జోత్ కౌర్(15 నాటౌట్) సైతం దూకుడుగా ఆడడంతో 9 ఓవర్లలో భారత్ వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

