Ashes Series : యాషెస్ మూడో టెస్టు(Ashes Third Test)కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. మూడో రోజు ఇప్పటికే రెండు సెషన్లు వర్షార్పణం అయ్యాయి. వాన తగ్గితే ఆట ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లంచ్ సమయం తర్వాత వరుణుడు కాసేపు శాంతించినట్టే కనిపించాడు. అయితే.. గ్రౌండ్ సిబ్బంది పిచ్ మీద కప్పిన కవర్లను తొలగిద్దామనుకునే లోపే మళ్లీ చినుకులు మొదలయ్యాయి. దాంతో, ఆస్ట్రేలియా(Australia), ఇంగ్లండ్(England) ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉండిపోయారు.
లీడ్స్‌లోని హెడింగ్లే(Headingley) స్టేడియంలో జరుగుతున్నఈ టెస్టులో ఆస్ట్రేలియా 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. మిచెల్ మార్ష్(18), ట్రావిస్ హెడ్(19) రెండో రోజు అజేయంగా నిలిచారు. దాంతో, ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.
ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్
మొదటి రెండు టెస్టుల్లో గెలిచిన ఆసీస్ మూడో టెస్టులోనూ ధాటిగా ఆడుతోంది. మిచెల్ మార్ష్ (118) సెంచరీతో కదం తొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు కొట్టింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ను ప్యాట్ కమిన్స్(Pat Cummins) దెబ్బతీశాడు, 6 వికెట్లతో ఆతిథ్య జట్టును వణికించాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్(80) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. టాడ్ మర్ఫీ అతడిని ఔట్ చేయడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. స్టోక్స్ సేన 237 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. దాంతో, ఆసీస్‌కు 31 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ టెస్టులోనూ నెగ్గి సిరీస్ సొంతం చేసుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్‌కు ఇది చావో రేవో లాంటి మ్యాచ్.