Rishabh Pant : భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) ఆరోగ్యంపై తాజా అప్డేట్ వచ్చింది. మోకాలి సర్జరీ(Knee Surgery) నుంచి వేగంగా కోలుకుంటున్నాడని, అయితే.. పంత్ మైదానంలోకి దిగి బ్యాట్ పట్టేందుకు మరింత సమయం పట్టనుందని ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(DDCA) అధ్యక్షుడు శ్యామ్ శర్మ(Shyam Sharma) అన్నాడు.
ఈమధ్యే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(National Cricket Academy)కి వెళ్లిన శర్మ అక్కడ పంత్‌ను కలిశాడు. రిహబిలిటేషన్(Rehabilitation)లో ఉన్నఈ వికెట్ కీపర్ మనపటికంటే మెరుగ్గా ఉండడం గమనించాడు. ‘పంత్ త్వరగా కోలుకుంటున్నాడు. అతను ఎప్పుడు బ్యాట్ పడతాడు? అనే ఆసక్తి అందరిలో ఉంది. కానీ, వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) తర్వాత అతను పూర్తిగా మెరుగవుతాడు. అప్పటి వరకు పంత్ పూర్తిగా ఫిట్నెస్ సాధిస్తాడు’ అని శర్మ అన్నాడు. అంతేకాదు పంత్ త్వరగా మైదానంలో అడుగుపెట్టాలని తాను కోరుకుంటున్నానని తెలిపాడు.
Not bad yaar Rishabh ❤️❤️😂. Simple things can be difficult sometimes 😇 pic.twitter.com/XcF9rZXurG
— Rishabh Pant (@RishabhPant17) June 14, 2023
నిరుడు కారు యాక్సిడెంట్లో గాయపడిన పంత్ ఆటకు దూరమై దాదాపు 7 నెలలు కావొస్తోంది. కష్ట సమయంలో మెరపు ఇన్నింగ్స్‌లు ఆడే పంత్ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేకపోతున్నారు. స్వదేశంలో బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో శ్రీకర్ భరత్(Srikar Bharat) ఫర్వాలేదనిపించాడు. దాంతో, అతడినే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) ఆడించారు. కానీ, అతను ఒత్తిడిని జయించి పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు. అవును.. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ టైటిల్ పోరులో ఈ లెఫ్ట్‌హ్యాండర్ లేని లోటు స్ఫష్టంగా కనిపించింది.