IND vs ENG : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఓవల్ టెస్టు ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగోరోజు దాదాపు గెలిచినంత పనిచేసిన ఇంగ్లండ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. టీ బ్రేక్ తర్వాత జోరుగా చినుకులు పడడంతో అంపైర్లు ఆటను నిలిపిపేస్తున్నట్టు ప్రకటించారు. హ్యారీ బ్రూక్ (111), జో రూట్(105)ల శతకాలతో గెలుపు వాకిట నిలిచిన ఆతిథ్య జట్టుకు ఇది పెద్ద ఎదురుదెబ్బనే. ఈ నేపథ్యంలో ఐదో రోజు తొలి సెషన్ కీలకం కానుంది. విజయం కోసం పోప్ సేనకు 35 రన్స్ అవనరమైతే..టీమిండియాకు నాలుగు వికెట్లు కావాలి. సో.. రేపు తొలి సెషన్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
సిరీస్‌ను సమం చేసే అవకాశమున్న ఓవల్ టెస్టులో భారత జట్టు గట్టిగానే పోరాడుతోంది. తొలి రెండు సెషన్లో ఇంగ్లండ్ బ్యాటర్ల జోరు కొనసాగినా.. టీ బ్రేక్ తర్వాత టీమిండియా పుంజుకుంది. ప్రసిధ్ కృష్ణ(3-109) విజృంభణతో సెంచరీ వీరుడు జో రూట్(), జాకబ్ బెథెల్ వరుసగా ఔటయ్యారు. దాంతో.. 323తో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ .. మరో 15 పరుగులకు ఆలౌట్ అంచున నిలిచింది. అయితే.. అదే ఊపులో వికెట్ల తీద్దామనుకోగా.. భారత పేసర్ల ఉత్సాహం వరుణుడు నీళ్లు చల్లాడు. చినుకులకు తోడూ వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఐదోరోజు ఇంగ్లండ్ బ్యాటర్లకు.. కొత్త బంతితో భారత బౌలర్లు స్వాగతం పలకనున్నారు.
STUMPS! It was all building up to a finish for the ages, but rain and bad light had other plans. We go to Day 5 👀🍿 pic.twitter.com/SYWe2jMw3C
— ESPNcricinfo (@ESPNcricinfo) August 3, 2025
ఓవర్ నైట్ స్కోర్ 50/1 తో నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లండ్ చూస్తుండగానే లక్ష్యాన్ని కరిగిస్తూ పోయింది. ఓపెనర్ బెన్ డకెట్(54),ఓలీ పోప్(27) లు త్వరగానే ఔటైనా.. హ్యారీ బ్రూక్(111), జో రూట్(105)లు క్రీజులో పాతుకుపోయారు. భారత బౌలర్లను విసిగించిన ఈ ద్వయం.. సెంచరీలతో కదం తొక్కి ఇంగ్లండ్‌ను గెలుపు వాకిట నిలిపింది. అయితే.. టీ బ్రేక్ తర్వాత సీన్ రివర్సైంది.
తొలి ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరిగిన ప్రసిధ్.. ఈసారి బెథెల్‌ను, చాపకింద నీరులా పరుగులు దొంగిలిస్తున్న రూట్‌ను ఔట్ చేశాడు. దాంతో, 332తో పటిష్ట స్థితిలో ఉన్న ఆతిథ్య జట్టు 15 పరుగుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం జేమీ స్మిత్(2 నాటౌట్), జేమీ ఓవర్టన్(0 నాటౌట్)లు జట్టు గెలుపు బాధ్యత తీసుకున్నారు. ఇంగ్లండ్ విజయానికి 37 పరుగులు అవసరం కాగా.. టీమిండియాకు 4 వికెట్లు కావాలి. ఇంకా 35 ఓవర్ల ఆట మిగిలి ఉండడంతో వర్షం తగ్గాక మ్యాచ్‌లో పుంజుకొనేది ఎవరు? అనేది ఆసక్తి రేపుతోంది.