IPL 2025 : సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు దంచలేకపోయారు. కేఎల్ రాహుల్(41), ట్రిస్టన్ స్టబ్స్ (34)లు మాత్రమే రాణించారు. దాంతో, భారీ స్కోర్ చేయలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ మిడిలార్డర్ విఫలమైంది. భువనేశ్వర్(3-33), హేజిల్‌వుడ్(2-36)లు విజృంభించడంతో స్కోర్ వేగం తగ్గింది. అయితే.. ఆఖర్లో స్టబ్స్ ధనాధన్ ఆడడంతో అక్షర్ పటేల్ బృందం నిర్ణీత ఓవర్లలో 162 పరుగులు చేసింది. మోస్తరు లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదిస్తే 14 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లుతుంది.
భారీ స్కోర్లతో ప్రత్యర్థులను వణికించే ఢిల్లీ క్యాపిటల్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తక్కువ స్కోర్‌కే కట్టడి చేసింది. టాస్ గెలిచి ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ఆర్సీబీ కెప్టెన్ నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టారు. ఓపెనర్లు అభిషేక్ పొరెల్(28), ఫాఫ్ డూప్లెసిస్(22)లు శుభారంభం ఇచ్చినా.. హేజిల్‌వుడ్ ఈ జోడీని విడదీసి బెంగళూరుకు బ్రేకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్(4)ను యశ్ దయాల్ వెనక్కి పంపాడు. 44 రన్స్‌కే రెండు వికెట్లు పడిన దశలో కేఎల్ రాహుల్(41) మరోసారి ఆపద్భాదవుడయ్యాడు. కెప్టెన్ అక్షర్ పటేల్(15), ట్రిస్టన్ స్టబ్స్(34)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
Abishek Porel provided #DC with a brisk start
Watch his breezy 28(11) 🔽
Updates ▶️ https://t.co/9M3N5Ws7Hm#TATAIPL | #DCvRCB
— IndianPremierLeague (@IPL) April 27, 2025
అయితే.. హేజిల్‌వుడ్ బంతిని అంచనా వేయలేక అక్షర్ బౌల్డ్ కావడం.. ఆ కాసేపటికే రాహుల్, అశుతోష్ శర్మ(2)లను భువనేశ్వర్ ఔట్ చేయడంతో ఢిల్లీ స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఆఖర్లో స్టబ్స్ మెరుపులతో జట్టుకు పెద్ద స్కోర్ అందించే బాధ్యత తీసుకున్నాడు. కానీ, భువీ వేసిన ఆఖరి ఓవర్లో విప్రజ్ నిగమ్(12) రనౌటయ్యాడు. ఆ తర్వాత స్టబ్స్ బౌండరీతో స్కోర్ 160కి చేరింది. కానీ, ఆ వెంటనే పెద్ద షాట్ ఆడి హేజిల్‌వుడ్ చేతికి చిక్కాడు. దాంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 రన్స్ కొట్టింది.
Unorthodox swings, outrageous results 👌
🎥 Vipraj Nigam and Tristan Stubbs pull out some magic to give #DC the late boost! 💪
Updates ▶️ https://t.co/9M3N5Ws7Hm#TATAIPL | #DCvRCB | @DelhiCapitals pic.twitter.com/PvviaHpxMl
— IndianPremierLeague (@IPL) April 27, 2025