IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో అజేయంగా దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మూడో మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ చేసింది. చెపాక్ స్టేడియంలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(77) దంచికొట్టాడు. యువకెరటం అభిషేక్ పొరెల్(33), కెప్టెన్ అక్షర్ పటేల్()లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీళ్లిద్దరూ త్వరగానే వెనుదిరిగినా మిడిల్ ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను రాహుల్ బెంబేలెత్తించాడు. ఇక ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (24) ధనాధన్ ఆడాడు. వీళ్లిద్దరి మెరుపులతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకన్న ఢిల్లీకి సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ ఆదిలోనే షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. సున్నాకే వికెట్ పడిన వేళ కేఎల్ రాహుల్(), అభిషేక్ పొరెల్(33)లు దూకుడుగా ఆడి సీఎస్కేపై ఒత్తిడి పెంచారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడుతున్న పొరెల్.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడబోయి పథిరనకు చిక్కాడు.
Innings Break!
KL Rahul’s 77(51) helps #DC set a competitive target of 1⃣8⃣4⃣ 🎯#CSK‘s reply 🆙 next 👉
Scorecard ▶ https://t.co/5jtlxucq9j #TATAIPL | #CSKvDC pic.twitter.com/zKhFY5W6fA
— IndianPremierLeague (@IPL) April 5, 2025
పొరొల్ వెనుదిరగడంతో 54 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్(21) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో స్ట్రెయిట్‌గా భారీ సిక్సర్ బాదిన అతడు.. నూర్ అహ్మద్ బౌలింగ్‌ను అంచనా వేయలేక క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దాంతో, 90 వద్ద ఢిల్లీ మూడో వికెట్ పడింది.
అక్షర్ పటేల్ వెనుదిరిగాక కేఎల్ రాహుల్ గేర్ మార్చాడు. చెన్నై స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలతో చెపాక్‌ను హోరెత్తించాడు. 33 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న రాహుల్ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. సమీర్ రిజ్వీతో కలిసి నాలుగో వికెట్‌కు 56 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. డిల్లీ స్కోర్ బోర్డును ఉరికిస్తున్న ఈ జోడీని ఖలీల్ విడదీశాడు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన ట్రిస్టన్ స్టబ్స్(21) రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో జట్టు స్కోర్ 180 దాటించాడు. పథిరన వేసిన 20వ ఓవర్లో రాహుల్, ఫినిషర్ అశుతోష్ శర్మ(1)లు ఔట్ కావడంతో ఢిల్లీ 183 పరుగులకే పరిమితమైంది.
3⃣ overs to go
KL Rahul still going strong as Tristan Stubbs joins him 🤝
Predict #DC‘s final score 👇
Updates ▶ https://t.co/5jtlxucq9j #TATAIPL | #CSKvDC pic.twitter.com/o3KPID5NzM
— IndianPremierLeague (@IPL) April 5, 2025