Dravid to Kohli | వచ్చేవారం నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ కోసం టీం ఇండియా ప్లేయర్లు నెట్స్‌లో బాగా కష్ట పడుతున్నారు. సారధి విరాట్ కోహ్లీకి జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ సూచనలిస్తూ ప్రోత్సహిస్తున్నాడు. ఈ ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసింది. కొద్దికాలంగా కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్న సంగతి తెలిసిందే. గత 13 టెస్టుల్లో సగటున 26 పరుగులు చేశాడు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత కోహ్లీ సెంచరీ చేయలేదు. ఆయన బెస్ట్ స్కోర్ 74. అయినా ఆయన సగటు 50 పరుగుల పైనే.
ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలోని పిచ్‌లపై సమర్థవంతంగా రాణించడానికి రాహల్ ద్రావిడ్ నుంచి కోహ్లీ సూచనలు, సలహాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ గాయంతో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. తత్ఫలితంగా కోహ్లీపైనే బ్యాటింగ్ భారం పడినట్లయింది.
ఇక బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ తదితరులు కూడా నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఈ నెల 26 నుంచి సెంచూరియన్‌లో తొలి టెస్ట్ ప్రారంభం కానున్నది.