టెస్ట్, వన్డే సిరీస్ కోసం టీమిండియా సౌతాఫ్రికా చేరుకుంది. ఇందులో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆ ప్రాక్టీస్ వీడియోని ఇప్పుడు బిసిసిఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫుట్ బాల్ ఆడుతున్నాడు.
How did #TeamIndia recharge their batteries ahead of their first training session in Jo'Burg? 🤔
— BCCI (@BCCI) December 18, 2021
On your marks, get set & Footvolley! ☺️😎👏👌#SAvIND pic.twitter.com/dIyn8y1wtz
ప్రస్తుతం బిసిసిఐతో కోహ్లీ కెప్టెన్సీ వివాదం నుడుస్తుండగా.. కోచ్ ద్రవిడ్‌తో కోహ్లీ ప్రాక్టీస్ కోసం ఫుట్‌బాల్ ఆడుతుండడం కనిపించడంతో క్రికెట్ అభిమానులకు కాస్త ఊరట లభించింది. ప్రాక్టీస్‌లో భాగంగా ఇండియన్ టీం రెండు జట్లుగా ఏర్పడింది. ఒకటి ద్రవిడ్ నాయకత్వంలో ఉండగా.. మరొకదానికి కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇరుజట్లు ఫుట్‌బాట్, వాలీబాల్ కోసం తలపడ్డాయి.
ప్రాక్టీస్ మధ్యలో కోహ్లీ, ద్రవిడ్ ఆటవిడుపు చేసుకుంటూ నవ్వుతూ చాలా సరదాగా కనిపించారు. ఈ వీడియో చూసిన కోహ్లీ అభిమానులకు కెప్టెన్సీ వివాదం నుంచి తమ అభిమాన క్రికటర్ కోలుకున్నట్లు కనిపించింది.
ఇటీవల టీ20 నాయకత్వం నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీని బిసిసిఐ వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించింది. దీనికి సంబంధించి కోహ్లీతో ముందే చర్చించామని ఒకవైపు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పగా.. మరోవైపు ఈ విషయంలో తనను క్రికెట్ బోర్డు ముందుగా సంప్రదించలేదని కోహ్లీ మీడియా సమావేశంలో చెప్పాడు. దీంతో బిసిసిఐ, భారత స్టార్ క్రికెటర్ కోహ్లీ మధ్య వివాదం మొదలైంది.