చెన్నై: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 132 పరుగుల ఛేదనలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్(25).. సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి మయాంక్ పంజాబ్‌కు శుభారంభం అందించాడు. తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆడుతూ బౌలర్లపై ఒత్తిడిపెంచాడు. దీంతో పవర్ ప్లే ఆఖరికి 45/0తో నిలిచింది. మరో ఎండ్‌లో కెప్టెన్ రాహుల్ నిలకడగా ఆడుతున్నాడు. 9 ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. ప్రస్తుతం రాహుల్(30), క్రిస్‌గేల్(1) క్రీజులో ఉన్నారు. పంజాబ్ విజయానికి ఇంకా 66 బంతుల్లో 75 పరుగులు చేయాల్సి ఉంది.
#PBKS have got off to a good start with 45/0 at the end of the powerplay!
— IndianPremierLeague (@IPL) April 23, 2021
Live – https://t.co/NMS54FiJ5o #PBKSvMI #VIVOIPL pic.twitter.com/IrWvo8JSmw