Ajinkya Rahane : వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)లో అందరి కళ్లన్నీ భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(Ajinkya Rahane)పైనే నిలిచాయి. రేపటితో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్నందున..’35 ఏళ్ల వయసులో జట్టులోకి వచ్చారు? మీ సన్నద్ధ గురించి చెప్పండి ?’ అని అడగడంతో రహానేకు చిర్రెత్తుకొచ్చింది. వయసు గురించి ఎందుకు? నా ఆటను చూడండి’ అని రిపోర్టర్లకు దిమ్మతిరిగే సమాధానంఇచ్చాడు. అంతేకాదు ‘వయసుతో పనేంటీ? ఇప్పుడు నాకు 35 ఏళ్లు. అయితేనేం.. ఎంతో ఫిట్‌గా, యంగ్‌గా ఉన్నా. నా బ్యాటింగ్‌లోని కొన్ని విషయాలపై దృష్టి పెట్టాను. ప్రస్తుతం ఆటను ఎంతో ఆస్వాదిస్తున్నా’ అని రహానే తెలిపాడు.
గతంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న రహానే కమ్‌బ్యాక్ తర్వాత తన పోస్ట్‌ను నిలబెట్టుకోవడం విశేషం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) అద్భుతంగా రాణించిన అతడు వెస్టిండీస్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. అనుభవజ్ఞుడైన అతడిని సెలెక్టర్లు మళ్లీ వైస్ కెప్టెన్‌ను చేశారు. భారత జట్టు కరీబియన్ గడ్డపై రెండు టెస్టులు ఆడనుంది. తొలి టెస్టు రేపు బార్బడాస్ స్టేడియంలో మొదలవ్వనుంది.
రెండేళ్ల క్రితం జట్టులో చోటు కోల్పోయిన రహానే అద్భుత రీతిలో రీ – ఎంట్రీ ఇచ్చాడు. గత సీజన్లో దేశవాళీ టోర్నీ(Domestic Cricket)ల్లో దుమ్మురేపిన అతను పదహారో సీజన్ ఐపీఎల్(IPL 2023)లోనూ సత్తా చాటాడు. చెన్నై సూపర్ కింగ్స(Chennai Super Kings) తరఫున మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.
పదహారో సీజన్లో అదరగొట్టిన రహానే
దాంతో, సెలెక్టర్ల దృష్టిలో పడి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపికయ్యాడు. అంతేకాదు చెన్నై జట్టు ఫైనల్ చేరడంలో రహానే కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో రహానే విలువైన పరుగులు చేశాడు. దాంతో, ధోనీ సేన ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.
ఇంగ్లండ్‌లోని ఓవల్ స్టేడియం(Oval Stadium)లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ పేసర్ల ధాటికి టాపార్డర్ చేతులెత్తేసిన సమయంలో రహానే నిలబడ్డాడు. బొటన వేలికి గాయం అయినా కూడా నొప్పిని భరిస్తూ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ కొట్టాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానే
రెండో ఇన్నింగ్స్‌లోనూ 46 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. అయితే.. విరాట్ కోహ్లీ, రహానే ఇద్దరూ స్వల్ప వ్యవధిలో పెవిలయిన్ చేరడంతో టీమిండియా ఓడిపోయింది. రెండోసారైనా టెస్టు గదను దక్కించుకోవాలనుకున్న భారత్ కల కలగానే మిగిలింది.