Wimbledon | వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో జొకోవిచ్ జోరు.. ఎనిమిదో టైటిల్ దక్కించుకుంటాడా?
Wimbledon | పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్.. వింబుల్డన్‌లో ఎనిమిదో టైటిల్ వేటను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్‌లో హుర్కాజ్పై జొకో గెలుపొందాడు. మెద్వెదెవ్, సిన్నెర్ కూడా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టగా.. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్, పెగులా, రైబాకినా, సబలెంక ముందంజ వేశారు. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు!
Wimbledon | పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్.. వింబుల్డన్‌లో ఎనిమిదో టైటిల్ వేటను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్‌లో హుర్కాజ్పై జొకో గెలుపొందాడు. మెద్వెదెవ్, సిన్నెర్ కూడా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టగా.. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్, పెగులా, రైబాకినా, సబలెంక ముందంజ వేశారు. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు!
వింబుల్డన్: అనుభవాన్నంత రంగరించి విజృంభించిన స్టార్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో ఇప్పటికే ఏడు టైటిల్స్ కైవసం చేసుకున్న జొకోవిచ్ 7-6, (8/6), 7-6 (8/6), 5-7, 6-4తో హబర్ట్ హర్కాజ్పై గెలుపొందాడు. గ్రాండ్‌స్లామ్‌లో 23 టైటిల్స్ నెగ్గి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న జొకోవిచ్ 14వసారి గ్రాస్‌కోర్ట్ క్వార్టర్‌కు చేరాడు. సెంటర్ కోర్ట్‌లో మూడు గంటలకు పైగా సాగిన పోరులో 18 ఏస్‌లు కొట్టిన జొకోవిచ్.. మూడు డబుల్ ఫాల్ట్స్ చేశాడు.
మరోవైపు 33 ఏస్‌లతో విజృంభించిన హర్కాజ్ 37 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరడం జొకోవిచ్‌కు ఇది 56వసారి కాగా.. పురుషుల సింగిల్స్‌లో రోజర్ ఫెదరర్ (58) మాత్రమే జొకో కంటే ముందున్నాడు. క్వార్టర్స్‌లో ఆండ్రీ రూబ్లేవ్తో జొకో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ మెద్వెదెవ్ 6-4, 6-2తో లిచెకాపై గెలుపొందగా.. ఐదో సీడ్ సిట్సిపాస్ 6-3, 6-7 (4/7), 6-3, 4-6, 4-6తో యూబాంక్స్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
స్వియాటెక్ చెమటోడ్చి..
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ కష్టపడి ముందంజ వేసింది. ప్రిక్వార్టర్స్‌లో స్వియాటెక్ 6-7 (4/7), 7-6 (7/2), 6-3తో బెన్కిక్పై విజయం సాధించింది. తొలి సెట్‌ను కోల్పోయిన స్వియాటెక్.. రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంది. ఒక దశలో ఓటమి ఖాయమే అనిపించినా.. తుదికంటా పోరాడిన పోలాండ్ భామ కీలక సమయాల్లో పాయింట్లు ఖాతాలో వేసుకొని ముందంజ వేసింది. ఇక 16 ఏండ్ల క్వాలిఫయర్ ఆండ్రీవా ప్రిక్వార్టర్స్‌లో 6-3, 6-7 (4/7), 2-6తో కైస్ చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో రిబాకినా వాకోవర్‌తో ముందంజ వేయగా.. పెగులా 6-1, 6-3తో సురెంకోపై గెలుపొందింది. స్వితోలినా 2-6, 6-4, 7-6 (11/9)తో అజరెంకాపై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.
ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జంట

Boppanna
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. పురుషుల డబుల్స్‌లో మాథ్యూ ఎబ్డెన్తో కలిసి బరిలోకి దిగిన బోపన్న రెండో రౌండ్లో 7-5, 6-3తో బ్రిటన్ ఆటగాళ్లపై విజయం సాధించారు. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో కాస్త తడబడిన బోపన్న జోడీ.. రెండో సెట్లో పూర్తి ఆధిపత్యం కనబర్చింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

