Rafael Nadal | టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కెరీర్ ముగిసింది. తన కెరియర్లో చివరి మ్యాచ్‌ను ఓటమితో ముగించాడు. డేవిస్ కప్‌లో నెదర్లాండ్స్ చేతిలో 2-1తో స్పెయిన్ ఓటమిపాలైంది. దీంతో స్పెయిన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన రఫెల్ నాదల్ కెరీర్.. చివరకు ఓటమితో ముగిసినట్లయ్యింది. 2004 తర్వాత తొలిసారిగా డేవిస్ కప్ నాదల్ సింగిల్స్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి. వాస్తవానికి నాదల్ అక్టోబర్‌లో డేవిస్ కప్‌తో టెన్నిస్‌కు వీడ్కోలు పలుకున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. దాదాపు రెండు దశాబ్దాల పాటు టెన్నిస్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు.
ఇకపై నాదల్ ఆటను చూసేందుకు అభిమానులకు అవకాశం లేదు. మ్యాచ్ కోసం నాదల్ ఫ్యాన్స్ తరలివచ్చారు. తీవ్ర భావోద్వేగాల బరిలోకి దిగాడు. కానీ, ఒకప్పటి ఫిట్నెస్, ఫామ్ లేమి కారణంగా తొలి సింగిల్స్‌లో నాదల్ 4-6, 4-6తో బొటిక్ వాన్డి జాండ్‌షల్ప్ చేతిలో ఓటమిపాలయ్యాడు. నాదల్ తన కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్‌లు సాధించాడు. గత కొద్దిరోజులుగా వరుస గాయాలతో సతమతమవుతున్న నాదల్.. నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నీ మూడింట్లోనూ పాల్గొనలేదు. డేవిస్ కప్‌కి ముందు చివరగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగినా.. నిరాశపరిచాడు. పరుషుల సింగిల్స్‌లో రెండోరౌండ్లో సెర్బియా స్టార్ జొకోవిచ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మ్యాచ్‌కు నాదల్ సహచరులు మాజీ స్పానిష్ గ్రాండ్ స్లామ్ విజేతలు కార్లోస్ మోయా, జువాన్ కార్లోస్ ఫెర్రెరోతో పాటు నాదల్ కుటుంబంతో పాటు అతని భార్య కూడా మ్యాచ్ వీక్షించేందుకు హాజరయ్యారు. మ్యాచ్ అనంతరం నాదల్ భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీటి మధ్య అభిమానులకు స్టేడియంలో అభివాదం చేశాడు.
రఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్‌ను నెగ్గగా.. 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్, రెండు సార్లు వింబుల్డన్ టైటిల్స్‌ను సాధించాడు. నాలుగుసార్లు యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచాడు. సింగిల్స్‌లో 82.6 శాతం మ్యాచ్‌లు గెలిచిన రికార్డు ఉంది. సింగిల్స్ కెరీర్లో 1080 మ్యాచ్‌లు గెలువగా.. 228 ఓడిపోయాడు. కెరీర్లో 92 టైటిల్స్‌ను సాధించాడు. పురుషుల సింగిల్స్‌లో చాలాకాలం నంబర్‌వన్‌గా కొనసాగాడు. నాదల్‌ను కింగ్ ఆఫ్ గ్రావెల్‌గా పిలుస్తుంటారు. రోలాండ్ గారోస్‌లో నాదల్ కంటే ఎక్కువ టైటిల్స్, ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడు లేడు. నాదల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో బంగారు పతకాన్ని, 2016 రియో ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌లో గోల్డ్ మెడల్‌ను అందుకున్నాడు.
Gracias Rafa, for everything ❤️💛#DavisCup #GraciasRafa #Rafa pic.twitter.com/zpoenLcXel
— Davis Cup (@DavisCup) November 19, 2024