GGW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో హ్యాట్రిక్‌పై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనూహ్యంగా భారీ స్కోర్ చేసింది. ఆరంభంలోనే గుజరాత్ జెయింట్స్ బౌలర్ల విజృంభణతో నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. చివరకు ప్రత్యర్థికి సవాల్ విసిరేంత లక్ష్యాన్ని నిర్దేశించింది. పవర్ ప్లేలోనే టాపార్డర్ కుప్పకూలగా.. రాధా యాదవ్(66) రీచా ఘోష్(44)లు అటాకింగ్ గేమ్‌తో ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 105 రన్స్ జోడించారు. దాంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
డబ్ల్యూపీఎల్ 9వ మ్యాచులో ఆర్సీబీ మిడిలార్డర్ గొప్పగా ఆడింది. పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు పడినా రాధా యాదవ్(66), రీచా ఘోష్(44)లు ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా గొప్పగా ఆడారు. టాస్ ఓడిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. కష్వీ గౌతమ్ చెలరేగడంతో డేంజరస్ ఓపెనర్ గ్రేస్ హ్యారిస్(17), దయలాన్ హేమలత(4) పెవిలియన్ చేరారు. కీలక ఇన్నింగ్స్ ఆడుదామనుకున్న కెప్టెన్ స్మృతి మంధాన(4) సైతం రేణుకా సింగ్ ఓవర్లో రాజేశ్వరికి క్యాచ్ ఇచ్చింది. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే.. గౌతమి నాయక్(4)ను సోఫీ డెవినె పెవిలియన్ పంపింది. దాంతో.. 45 పరుగులకే 4 వికెట్లు పడ్డాయి. ఇక ఆర్సీబీ స్వల్ప స్కోర్‌కే పరిమితమవ్వడం ఖాయమనుకున్నారంతా.
Radha Yadav bringing the much-needed big hits! 💪
A couple of quality shots from her 👏
Updates ▶️ https://t.co/HHBOE0REFf #TATAWPL | #KhelEmotionKa | #RCBvGG pic.twitter.com/QDLr8pUfPg
— Women’s Premier League (WPL) (@wplt20) January 16, 2026
ప్రధాన బ్యాటర్లు విఫలైమనా జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకున్నారు రాధా యాదవ్(66), రీచా ఘోష్(44). వీరిద్దరూ ఏమాత్రం ఆత్మరక్షణ ధోరణితో ఆడకుండా గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా రాధ బ్యాట్ ఝులిపించి డబ్ల్యూపీఎల్‌లో తొలి అర్ధ శతకం బాదేసింది. రీచా జతగా 66 బంతుల్లోనే ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిందీ ఆల్‌రౌండర్. 105 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని జార్జియా వరేహం విడదీసింది. ఆ తర్వాత వచ్చిన నడినే డీక్లెర్క్(26) ఉన్నంత సేపు దంచేసింది. కష్వీ గౌతమ్ వేసిన 19వ ఓవర్లో రెచ్చిపోయిన డీక్లెర్క్ 6, 4, 4, 6 తో 22 రన్స్ రాబట్టింది. అయితే.. డివెన్(3-31) రెండు వికెట్లు తీసి 4 రన్స్ మాత్రమే ఇవ్వడంతో ఆర్సీబీ 182కే పరిమితమైంది.
Putting on a show! 🫴🔥
🎥 Same fielding position, two spectacular grabs, ft. Shivani Singh and Rajeshwari Gayakwad 👏
Updates ▶️ https://t.co/HHBOE0REFf #TATAWPL | #KhelEmotionKa | #RCBvGG pic.twitter.com/iD9PXcFY5E
— Women’s Premier League (WPL) (@wplt20) January 16, 2026