INDW vs BANW | రాణించిన ఫిర్దౌస్, సుల్తానా.. టీమిండియాను ఊరిస్తున్న లక్ష్యం..!
INDW vs BANW : మహిళల టీ20 ప్రపంచకప్ కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత్ 136 పరుగులకు కట్టడి చేసింది. ఆరంభంలోనే వికెట్ పడినా.. ఓపెనర్ జువారియా ఫిర్దౌస్(33), నిగర్ సుల్తానా(32)లు ధనాధన్ ఆడారు.
INDW vs BANW : మహిళల టీ20 ప్రపంచకప్ కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత్ 136 పరుగులకు కట్టడి చేసింది. ఆరంభంలోనే వికెట్ పడినా.. ఓపెనర్ జువారియా ఫిర్దౌస్(33), నిగర్ సుల్తానా(32)లు ధనాధన్ ఆడారు. మిడిల్ ఓవర్లలో రాధా యాదవ్(3-28), శ్రీచరణి(2-21)లు వికెట్లు తీసి పరుగులు నియంత్రించారు. కానీ, ఆఖర్లో షోర్నా అక్తర్(13) మెరుపులతో బంగ్లాదేశ్ మోస్తరు లక్ష్యాన్ని నిలిపింది. రెండు విజయాలతో రెండో స్థానంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్ గెలిస్తే ఆరు పాయింట్లతో సెమీస్ అవకాశాల్ని మెరుగుపరచుకోనుంది.
టాస్ ఓడిన టీమిండియా బంతితో తేలిపోయింది. బంగ్లాదేశ్ బ్యాటర్లను కట్టడి చేస్తారనుకుంటే బౌలర్లు పరుగులిచ్చేశారు. రేణుకా సింగ్ తన రెండో ఓవర్ చివరి బంతికి డిలరా అక్తర్(4)ను ఔట్ చేసింది. తొలి వికెట్ పడినా సరే భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఓపెనర్ జువారియా ఫిర్దౌస్(33) ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించారు. శోభనా మొస్త్రే(22) మెరుపులతో పవర్ ప్లేలోనే స్కోర్ 40 దాటింది.
Innings Break!
Collective bowling effort from #TeamIndia restricts Bangladesh to 136 🎯
Over to the batters to chase it ⏳
Scorecard ▶️ https://t.co/mWgNXcEkp0#T20WorldCup | #WomenInBlue | #INDvBAN pic.twitter.com/imyTPMQsSu
— BCCI Women (@BCCIWomen) June 25, 2026
డేంజరస్ ఫిర్దౌస్ను వెనక్కి పంపిన నందిని శర్మ తీసి ఊరటనిచ్చారు. కానీ, నందిని వేసిన 14వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదింది నిగర్ సుల్తానా. ఆఖర్లో షోర్నా అక్తర్(13) బ్యాట్ ఝులిపించడంతో స్కోర్ దాటింది. సమిష్టిగా రాణించడంతో బంగ్లా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

