బెంగుళూరు: న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra).. ఇప్పుడు ఆ జట్టుకు కీలక బ్యాటర్‌గా మారిన విషయం తెలిసిందే. ఇండియన్ మూలాలు ఉన్న ఆ క్రికెటర్ ప్రస్తుతం కివీస్‌కు ఆడుతున్నాడు. అయితే తాజాగా జరుగుతున్న వరల్డ్‌కప్‌లో అతను తన బ్యాటింగ్ శైలితో ఆకట్టుకుంటున్నాడు. రచిన్ రవీంద్ర పేరెంట్స్‌ది బెంగుళూరు. అతని పేరెంట్స్ న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. అయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ కోసం బెంగుళూరు వచ్చిన రచిన్ రవీంద్ర .. తన పేరెంట్స్ ఇంటికి వెళ్లారు.
जय श्री राम 🕉
Blessed to have such an amazing family. Grandparents are angels whose memories and blessings stay with us forever. pic.twitter.com/haX8Y54Sfm— Rachin Ravindra (@RachinRavindra_) November 10, 2023
రవీంద్ర నానమ్మ క్రికెటర్‌కు దిష్టితీసింది. ఇంటికి వెళ్లిన అతన్ని ఓ సోఫాలో కూర్చోపెట్టి.. ఆ బామ్మ దిష్టి తీసింది. క్రికెటర్ రవీంద్రకు దిష్టితీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి, తల్లి దీపి.. బెంగుళూరుకు చెందినవారే. ఆ ఇద్దరూ 1997 వరకు ఇక్కడే ఉన్నారు. కృష్ణమూర్తి ఇక్కడ క్లబ్ క్రికెట్ ఆడేవారు. ఆ తర్వాత అతను వెల్లింగ్టన్లో టెకీగా స్థిరపడ్డారు. రచిన్ పుట్టింది అక్కడే. కానీ చిన్నతనం నుంచి రచిన్ తరుచూ ఇండియా వస్తూ వెళ్లాడు. న్యూజిలాండ్ కూడా రచిన్ తండ్రి క్లబ్ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇచ్చాడు. హట్ హాక్స్ క్లబ్‌ను ఏర్పాటు చేశాడు. రచిన్‌కు క్రికెట్ పాఠాలు నేర్పేది అతని తండ్రే.
ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రచిన్ రవీంద్ర టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక గురువారం లంకతో జరుగుతున్న మ్యాచ్ సమయంలో.. స్టేడియంలోని ప్రేక్షకులు రచిన్ అంటూ అరిచారు. ఆ సందర్భాన్ని అతను గుర్తు తెచ్చుకున్నాడు. బెంగుళూరులో ఆడడం ప్రత్యేకమైందని, ప్రేక్షకులు తనకు మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందన్నాడు. ఆరు నెలల క్రితం తన పేరు జట్టులో లేదని, కానీ ఇప్పుడు జట్టులో కీలక సభ్యుడిని కావడం సంతోషంగా ఉందన్నాడు. టీనేజీలో క్లబ్ క్రికెట్ ఆడేందుకు ఇక్కడకు వచ్చినట్లు చెప్పాడు.
వరల్డ్‌కప్‌లో రచిన్ ఇప్పటి వరకు 565 రన్స్ స్కోర్ చేశాడు. రచిన్ తన ఎక్స్ అకౌంట్లో బామ్మ దిష్టితీస్తున్న వీడియోను పోస్టు చేశాడు. ఆ వీడియోకు జై శ్రీరాం అని రాశాడు. అందమైన కుటుంబాన్ని పొందడం దీవనగా భావిస్తున్నట్లు చెప్పాడు. గ్రాండ్‌పేరెంట్స్ దీవెనలు ఎప్పటికీ తనతో ఉంటాయన్నారు.