ODI World Cup 2023 : న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర(100 : 90 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ) వరల్డ్ కప్‌లో మరో సెంచరీ కొట్టేశాడు. బెంగళూరులో పాక్ పేస్ దళాన్ని చీల్చి చెండాడిన ఈ యంగ్‌స్టర్ మూడో శతకంతో రికార్డు సృష్టించాడు. మహ్మద్ వసీం వేసిన 34వ ఓవర్లో బౌండరీతో 99 పరుగులకు చేరువైన రవీంద్ర.. అనంతరం సింగిల్ తీసి వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు.
కెప్టెన్ కేన్ విలియమ్సన్ (95 : 79 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకున్నాడు. ఇఫ్తికార్ అహ్మద్ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి.. బౌండరీ వద్ద ఫఖర్ జమాన్ చేతికి చిక్కాడు. దాంతో కివీస్ 248 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోయింది. డారిల్ మిచెల్ క్రీజులోకి వచ్చాడు. 35 ఓవర్లకు కివీస్ రెండు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.
Went for the six to get his 💯, but holes out at long-off 💔
Nevertheless, a stunning knock on his (second) comeback 👏
👉https://t.co/adkwhgOKPg | #PAKvNZ | #CWC23 pic.twitter.com/XDqDpjk5v0
— ESPNcricinfo (@ESPNcricinfo) November 4, 2023