ఆర్థిక లోటు ఉన్నా విద్యుత్తు చార్జీలు పెంచం!
మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తు న్న తరుణంలో కాంగ్రెస్ సర్కార్ విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదన ఉపసంహరించుకున్నది. చార్జీలు పెంచితే ఓటమి తప్పదని గ్రహించి విరమించుకోగా, మొత్తంగా పురపాలక ఎన్నికల నేపథ్యంలో వినియోగదారులకు ఆర్థిక భారం తప్పింది.
- రూ.22,104 కోట్ల ఆర్థికలోటులో రెండు డిస్కంలు
- పాత టారిఫ్‌నే అనుమతించాలని ఈఆర్సీకి వినతి
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలపై విద్యుత్తు
- బాదుడును ఉపసంహరించుకున్న కాంగ్రెస్ సర్కార్
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తు న్న తరుణంలో కాంగ్రెస్ సర్కార్ విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదన ఉపసంహరించుకున్నది. చార్జీలు పెంచితే ఓటమి తప్పదని గ్రహించి విరమించుకోగా, మొత్తంగా పురపాలక ఎన్నికల నేపథ్యంలో వినియోగదారులకు ఆర్థిక భారం తప్పింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు చార్జీలు పెంచబోమని, ప్రస్తుత టారిఫ్‌నే ఆమోదించాలని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని ఇప్పటికే డిస్కంలు అభ్యర్థించాయి. 2026- 27 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ సరఫరా వ్యాపారం కోసం సమగ్ర ఆదాయ ఆవశ్యకత నివేదికలను రెండు డిస్కమ్‌లు ఈఆర్సీకి సమర్పించాయి. ఈ నెల 31 వరకు నివేదికపై అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తారు. మార్చి 5న హనుమకొండలో, మార్చి 7న హైదరాబాద్‌లోని ఈఆర్సీ కార్యాలయంలో విచారణ జరి పి, టారిఫ్ ఆర్డర్‌ను జారీ చేస్తే ఆమోదిత టారిఫ్ ఏప్రిల్ 1నుంచి అమల్లోకి రానున్నది.
రాబడి తక్కువ.. అవసరాలు ఎక్కువ
హైదరాబాద్‌లోని దక్షిణ డిస్కమ్ ఆదాయ ఆవశ్యకత రూ.50,242 కోట్లు కాగా, చార్జీల రూపంలో రూ.40,659 కోట్లు సమకూర్చుకుంటూ రూ.9,583 కోట్లను లోటుగా చూపిస్తున్నది. హనుమకొండ కేంద్రంగా సేవలందిస్తున్న ఉత్తర డిస్కమ్ ఆదాయ ఆవశ్యకత రూ.22,754 కోట్లు కాగా కేవలం రూ.10,233 కోట్ల ఆదాయంతో రూ.12,521 కోట్ల లోటును చూపుతున్నది. రెండు డిస్కమ్‌లు కలిపి రూ.22,104 కోట్ల లోటులో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. రాబడి తక్కువ, వ్యయం ఎక్కువ అన్నట్టుగా తయారైంది ఉత్తర డిస్కమ్ పరిస్థితి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

