IPL 2025 : డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి విజయం దిశగా సాగుతోంది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో ఓపెనర్ క్వింటన్ డికాక్(53) అర్ధ శతకంతో జట్టు విజయానికి బాటలు వేశాడు. ఓపెనర్ మోయిన్ అలీ(5) వెనుదిరిగాక.. కెప్టెన్ అజింక్యా రహానే(18)లు వెనుదిరిగిన తన మార్క్ షాట్లతో చెలరేగుతున్నాడు డికాక్. ప్రస్తుతం ఇంప్యాక్ట్ ప్లేయర్ అంగ్క్రిష్ రఘువంశీ(2) సాయంతో కోల్‌కతాను తొలి గెలుపు దిశగా నడిపించే పనిలో నిమగ్నమయ్యాడీ లెఫ్ట్ హ్యాండర్. 11 ఓవర్లకు కోల్‌కతా స్కోర్.. 80-2.
డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ల ధాటికి ఆ జట్టు టాపార్డర్ కప్పకూలింది. వరుణ్ చక్రవర్తి(2-17), మోయిన్ అలీ(2-32)లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు చెమటోడ్చారు. ఓపెనర్ సంజూ శాంసన్(29) మరోసారి నిరాశపరచగా.. యువకెరటం ధ్రువ్ జురెల్(33) సమయోచితంగా ఆడి జట్టు స్కోర్ 100 దాటించాడు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్(16) రెండు సిక్సర్లు బాదడంతో రాజస్థాన్ 150 మార్క్ అందుకోగలిగింది.
Maiden 5️⃣0️⃣ in @KKRiders‘ colours 💜
Quinton de Kock with a steady innings so far 👌#KKR lose their skipper and require 72 runs off 54 deliveries.
Updates ▶ https://t.co/lGpYvw87IR#TATAIPL | #RRvKKR pic.twitter.com/LZW5OlVELz
— IndianPremierLeague (@IPL) March 26, 2025