PV Sindhu | భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. డబుల్ ఒలింపియన్ అయిన సింధు..ఈసారి కచ్చితంగా పతకం గెలుస్తుందన్న భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది. అయితే గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ పోరులో సింధు 19-21, 14-21తో చైనాకు చెందిన హీ బింగ్జియావో చేతిలో ఓడింది.
దాదాపు గంటసేపు హోరాహోరీగా సాగిన పోరులో చైనా షట్లర్‌కు దీటైన పోటీనివ్వడంలో సింధు విఫలమైంది. మరోవైపు కీలక క్వార్టర్స్‌లో మాజీ ప్రపంచ నంబర్‌వన్ జోడీ సాత్విక్-చిరాగ్ 21-13, 14-21, 16-21తో ఆరోన్ చియా-సో వుయి యిక్ (మలేషియా) చేతిలో పోరాడి ఓడింది.