పారిస్ : బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాజీ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గురువారం ఇక్కడ జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 15వ ర్యాంకు సింధు.. 21-19, 21-15తో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ ఝీ ఈ (చైనా)ను ఓడించి క్వార్టర్స్ చేరింది. 2019లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తెలుగమ్మాయి.. 48 నిమిషాల్లోనే వరుస గేమ్స్‌ను గెలుచుకుని వాంగ్‌కు షాకిచ్చింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదుసార్లు పతకాలు గెలిచిన సింధు..
ప్రిక్వార్టర్స్ గేమ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి 11-6తో ఆధిక్యంలో నిలిచింది. పదునైన స్మాష్‌లు, నెట్ విన్నర్స్‌తో ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే వాంగ్ కూడా పుంజుకోవడంతో 19-19తో ఇరువురి పాయింట్లు సమమైనా ఆ గేమ్‌ను సింధు గెలుచుకుంది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకుండానే సింధు ఆటను విజయంతో ముగించింది.
మిక్స్డ్ డబుల్స్‌లో భారత ద్వయం ధృవ్ కపిల-తనీషా క్రాస్టో 19-21, 21-12, 21-15తో ప్రపంచ ఐదో ర్యాంక్ జంట టాంగ్ చౌన్ మన్ సె యింగ్ సువెట్ (హాంకాంగ్)ను ఓడించింది.