క్వార్టర్స్‌లో సింధు, లక్ష్యసేన్
థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత టాప్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ సింధు 21-13, 21-15 తేడాతో కేవలం 28 నిమిషాల్లోనే డెన్మార్క్‌కు చెందిన అమాలీ షుల్జ్‌ను చిత్తు చేసింది.
బ్యాంకాక్ : థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత టాప్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ సింధు 21-13, 21-15 తేడాతో కేవలం 28 నిమిషాల్లోనే డెన్మార్క్‌కు చెందిన అమాలీ షుల్జ్‌ను చిత్తు చేసింది. క్వార్టర్స్‌లో ఆమె జపాన్ స్టార్, ప్రపంచ నంబర్ .3 అకానె యమగూచితో తలపడనుంది. కానీ, భారత యువ షట్లర్ దేవిక సిహగ్ 21-23, 11-21తో పిచామోన్ ఓపాట్నిపుత్ (థాయిలాండ్)చేతిలో ఓడిపోయింది.
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ లక్ష్యసేన్ 21-12, 21-13తో చైనా షట్లర్ జూ జువాన్ చెన్ను వరుస గేమ్స్‌లో ఓడించి క్వార్టర్స్‌లో లోకల్ ఫేవరెట్ కున్లావుట్ విటిడ్సార్న్తో పోటీకి రెడీ అయ్యాడు. అయితే, వెటరన్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ 16-21, 21-11, 18-21తో సు లీ యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి 21-12, 21-19తో బ్రియాన్ జెరెమీ-ముహమ్మద్ హైకల్ (మలేషియా) ద్వయాన్ని ఓడించి ముందంజ వేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

