న్యూఢిల్లీ: రెండు సార్లు ఒలింపిక్ పతకాలు గెలిచిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు(PV Sindhu) గాయపడింది. ఆమె ఎడమ మోకాలుకు స్వల్పంగా క్రాక్ వచ్చినట్లు గుర్తించారు. స్కాన్ తీసిన తర్వాత డాక్టర్లు ఆమెకు రెస్టు సూచించారు. గత వారం రెన్నిస్లో జరిగిన ఫ్రెంచ్ సూపర్ ఓపెన్ రెండో రౌండ్లో సింధు గాయంతో తప్పుకున్నది. థాయిలాండ్‌కు చెందిన సుపనిదా కటేతాంగ్‌తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆమె గాయానికి లోనైంది. మళ్లీ ట్రైనింగ్ మొదలుపెట్టడానికి ముందు కొన్ని వారాలు రెస్టు తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు సింధు తెలిపింది. బ్రేక్ తీసుకోవడం వల్ల రాబోయే ఒలింపిక్స్ క్రీడలపై ఫోకస్ పెట్టవచ్చు అని ఆమె తెలిపారు. త్వరలోనే మళ్లీ కోర్టులో అడుగుపెట్టనున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుత సీజన్లో పీవీ సింధు తడబడుతోంది. ఆమె తన ఫామ్‌ను కోల్పోయింది. దాదాపు ఆర్నెళ్ల తర్వాత మళ్లీ ఇటీవలే ఆమె టాప్ టెన్‌లో చోటు సంపాదించింది. ఆర్కిటిక్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్ టోర్నీల్లో సెమీస్‌కు వెళ్లడంతో ఆమె ర్యాంక్ కొంత మెరుగుపడుంది. ఆగస్టులో సింధు ర్యాంక్ 17కు పడిపోయిన విషయం తెలిసిందే. ఈ నవంబర్ 7 నుంచి 12 వరకు కొరియా మాస్టర్స్, నవంబర్ 14 నుంచి 19 వరకు జపాన్ మాస్టర్స్, నవంబర్ 21 నుంచి 26 వరకు చైనా మాస్టర్స్, నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకు సయ్యిద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ టోర్నీలు జరగనున్నాయి.
Determined to come back firing on all cylinders ❤️
Not the ideal update, but going to make this count 🤫
Let’s do this 💪@DrZeinia , @OGQ_India and my whole team pic.twitter.com/mFHhdJXaea
— Pvsindhu (@Pvsindhu1) October 31, 2023