పీవీ సింధు.. మైదానం బయట పదహారణాల తెలుగమ్మాయి. చీరలంటే ఇష్టం. కుటుంబమంటే ప్రాణం. బంధాలకు విలువనిస్తుంది. సెంటిమెంట్లను గౌరవిస్తుంది. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో తన మనసు బయటపెట్టింది.
ఎక్కడున్నా రోజూ ప్రాక్టిస్ చేయాల్సిందే. జిమ్‌కు వెళ్లాల్సిందే. నా ట్రెయినర్ ఇచ్చిన షెడ్యూల్‌ను అనుసరించాల్సిందే. నాకు మరే వ్యాపకాలూ ఉండవు. ఎక్కడి నుంచి వచ్చాం, మన విలువలేమిటి, మన గమ్యమేమిటి? అన్న ఎరుక తప్పనిసరిగా ఉంటుంది.
నా ఫ్యామిలీ. మ్యాచ్‌లు లేనప్పుడు కుటుంబం, బంధువులతో గడపడం ఇష్టం. మా చెల్లి కొడుకుతో టైమ్ స్పెండ్ చేస్తా. ఇంట్లో ఉన్నప్పుడు.. ఉదయం
లేవగానే వాడి మొహమే చూస్తా.
నా పెట్ డాగ్. రియో లాబ్రడర్. ఇంటికి వచ్చేసరికి నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అది నా స్ట్రెస్ బస్టర్.
ఖాళీ దొరకడం చాలా తక్కువ. ఒకవేళ దొరికితే ఫ్యామిలీతో ఉంటా. జంక్ ఫుడ్, చాక్లెట్లు తింటా.
పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణమే నా లక్ష్యం. దానికంటే ముందు కూడా చాలా టోర్నమెంట్లు ఉన్నాయి.
సలహా అని కాదు. కష్టపడితేనే ఫలితం వస్తుంది అని మాత్రం చెప్ప
గలను. దెబ్బలు తగలకుండా ఆడాలి. ఫిట్నెస్ కాపాడుకోవాలి. లేకపోతే ఈ రంగంలో ఎదగడం కష్టం.
ఒక మ్యాచ్‌లో ఓడిపోతాం. మరో మ్యాచ్‌లో గెలుస్తాం. గెలుపోటములు సహజం. అయితే.. ఓడినప్పుడు కొంత బాధ సహజం. అందులోంచి తొందరగా బయటపడితే విజయానికి ఒక అడుగు పడ్డట్టే.
అందరు అమ్మాయిల్లానే. చీరకట్టు ఇష్టం. నచ్చిన దుస్తులు వేసుకుంటా. ఇష్టమైంది చేస్తా. సింధు అంటే కోర్టులో మాత్రమే ప్లేయర్. జీవితంలో కాదు కదా!
నేను చాలా సెన్సిటివ్. తొందరగా ఏడుపొచ్చేస్తుంది. ఆటలో మాత్రం దూకుడుగానే ఉంటా.