న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ టాప్-5 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకుంది. మంగళవారం ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ తాజా ర్యాంకింగ్స్‌లో సింధు 5వ స్థానంలో నిలిచింది. థామస్ కప్ విన్నర్ ప్రణయ్ ఒక ర్యాంక్ మెరుగై 12వ స్థానానికి చేరుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తరువాత మోకాలి గాయంతో పోటీలకు దూరంగా ఉన్న సింధు, తాను పాల్గొన్న గత 26 టోర్నీలలో 87,218 పాయింట్లతో మూడేండ్ల తరువాత టాప్-5లో స్థానం దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 8వ ర్యాంక్‌లో నిలిచాడు.