జకర్తా: భారత షట్లర్లకు మరోసారి నిరాశే ఎదురైంది. జకర్తాలో జరుగుతున్న ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలో నిలిచిన పీవీ సింధు, లక్ష్యసేన్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. ఈ ఇద్దరూ క్వార్టర్స్‌లో తమ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్‌లో సింధు.. 13-21, 17-21తో ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ యు ఫీ (చైనా) చేతిలో ఓటమిపాలైంది.
తొలి గేమ్‌లో ప్రత్యర్థి జోరుకు నిలువలేకపోయిన సింధు.. రెండో గేమ్ ఒక దశలో 17-18తో హోరాహోరీగా పోరాడింది. ఈ దశలో ఆమె సహనం కోల్పోవడంతో చైర్ అంపైర్ సింధుకు రెడ్‌కార్డ్ చూపించాడు. ఆ తర్వాత కూడా సింధు పుంజుకోలేకపోయింది. మరో పోరులో సేన్.. 18-21, 20-22తో థాయ్‌లాండ్ యువ సంచలనం పనిచఫాన్ తీరరత్సకుల్ దూకుడుకు తలవంచాడు.