జకర్తా: ఇండోనేషియా మాస్టర్స్‌లో స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ క్వార్టర్స్‌కు చేరినా శ్రీకాంత్, అన్మోల్ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు.. 21-19, 21-18తో లైన్ హోజ్‌మార్క్‌ను ఓడించింది. ఈ విజయంతో సింధు తన కెరీర్లో 500 మ్యాచ్‌లు గెలిచి అరుదైన మైలురాయిని సొంతం చేసుకుంది.
అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనతను అందుకున్నవారిలో సింధు ఆరో (భారత్ నుంచి మొదటి) స్థానంలో ఉంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య.. 21-10, 21-11తో జేసన్ గునవన్పై ఏకపక్ష విజయం సాధించాడు.