IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో బిగ్ ఫైట్. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కీలక పోరుకు మరికాసేపట్లో తెరలేవనుంది. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు. పవర్ హిట్టర్లతో నిండిన ఇరుజట్లలో పైచేయి సాధించేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. లక్నోకు మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్.. రూపంలో భారీ హిట్టర్లు ఉన్నారు. అటు పంజాబ్‌కు ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్‌లు కొండంత బలం కానున్నారు.
తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్‌పై ఘన విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. అటు లక్నో తొలిపోరులో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడినా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జయభేరి మోగించింది. దీంతో, ఈమ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుంది? అనేది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.
🚨 Toss 🚨@PunjabKingsIPL won the toss and elected to bowl first against @LucknowIPL
Updates ▶️ https://t.co/j3IRkQFZpI#TATAIPL | #LSGvPBKS pic.twitter.com/DVuoMtnnop
— IndianPremierLeague (@IPL) April 1, 2025
పంజాబ్ తుది జట్టు : ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సూర్యాన్ష్ షెడ్గే, మార్కో యాన్సెన్, లాకీ ఫెర్గూసన్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్.
లక్నో తుది జట్టు : మిచెల్ మార్ష్, ఎడెన్ మర్క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ బదొని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేశ్ సింగ్ రథీ, శార్థూల్ ఠాకూర్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్.