IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ క్వాలిఫయర్ 2 మరికాసేపట్లో షురూ కానుంది. టైటిల్ పోరుకు ఒక్క అడుగు దూరంలో నిలిచిన పంజాబ్ కింగ్స్(Punjab Kings), ముంబై ఇండియన్స్ జట్లు(Mumbai Indians) విజయం కోసం సర్వశక్తులు ఒడ్డనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్‌కోసం పంజాబ్ తమ స్పిన్ అస్త్రం చాహల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. మరవైపు ముంబై సైతం పేసర్ గ్లీసన్ స్థానంలో టాప్లేకు చోటు కల్పించింది.
లీగ్ ఆరంభం నుంచి ఉత్కంఠ పోరాటాలను ఆస్వాదిస్తున్న అభిమానులకు క్వాలిఫయర్ 2 అనేది మరో విందు భోజనం లాంటి మ్యాచ్. అయితే.. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబైని నిలువరిస్తేనే పంజాబ్ విజయకావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఎలిమినేటర్‌లో గుజరాత్ బౌలర్లపై అర్ధ శతకంతో విరుచుకుపడిన.. రోహిత్‌ను త్వరగా ఔట్ చేయడం చాలా ముఖ్యం.
Preps in place ✅
Game faces 🔛Folks, we are closing in on A HUGE CONTEST 🔥
Updates ▶ https://t.co/vIzPVlDqoC#TATAIPL | #PBKSvMI | #Qualifier2 | #TheLastMile | @PunjabKingsIPL | @mipaltan pic.twitter.com/1dssUB5QQR
— IndianPremierLeague (@IPL) June 1, 2025
లెఫ్ట్ ఆర్మ్ పేసర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడే హిట్‌మ్యాన్‌ను అర్షదీప్ బోల్తా కొట్టిస్తే.. పంజాబ్ కాసింత భరోసాగా ఉండచ్చు. మిడిల్ ఓవర్లలో పరుగులను నియంత్రిస్తూ.. చాహల్ వికెట్ల వేట సాగిస్తే అయ్యర్ సేనకు అవకాశాలు ఉంటాయి. కానీ, సూర్యకుమార్ ఎంతటి కష్టమైన పరిస్థితుల్లోనూ చెలరేగగల మొనగాడు. అతడికి తిలక్ వర్మ, పాండ్యాలు జతకలిశారంటే మరోసారి 200 ప్లస్ నమోదవ్వడం ఖాయం.
ముంబై తుది జట్టు : రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధిర్, మిచెల్ శాంట్నర్, రాజ్ బవ, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, రీసే టాప్లే.
ఇంప్యాక్ట్ సబ్స్ : అశ్వనీ కుమార్, క్రిష్ణన్ శివర్జిత్, రఘు శర్మ, రాబిన్ మింజ్, బెవొన్ జాకొబ్.
🚨 Toss 🚨@PunjabKingsIPL won the toss and elected to bowl first against @mipaltan in #Qualifier2
Updates ▶️ https://t.co/vIzPVlDqoC#TATAIPL | #PBKSvMI | #TheLastMile pic.twitter.com/l3PcmZvc9Y
— IndianPremierLeague (@IPL) June 1, 2025
పంజాబ్ తుది జట్టు : ప్రియాన్ష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నేహల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైలీ జేమీసన్, విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్.
ఇంప్యాక్ట్ సబ్స్ : ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాన్ష్ షెడ్గే, గ్జావియర్ బార్ట్లెట్, హర్‌ప్రీత్ బ్రార్.