IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్లో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న టైటిల్ పోరులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్(Punjab Kings) బౌలింగ్ ఎంచుకుంది. క్వాలిఫయర్ 2లో 204 పరుగుల లక్ష్యాన్ని ఉదిపడేసిన శ్రేయాస్ అయ్యర్ బృందం ఈసారి ఛేదనకే మొగ్గు చూపింది. ఏ మార్పులు లేకుండా ఆడుతున్నామని అయ్యర్ తెలిపాడు. ఆర్సీబీ కూడా క్వాలిఫయర్ 1లో ఆడిన తుది జట్టునే ప్రకటించింది.
అయితే.. ఈ సీజన్లో 8 సార్లు 200 ప్లస్ స్కోర్ చేసిన పంజాబ్‌ను నిలువరించాలంటే.. బెంగళూరు బ్యాటర్లు దంచి కొట్టాల్సిందే. కనీసం 230 ప్లస్ లక్ష్యాన్ని నిర్దేశించగలగాలి. అదీ సాధ్యం కాదంటే.. గత పోరులో మాదిరిగానే పేసర్లు చెలరేగి పంజాబ్ టాపార్డర్‌ను కూల్చాలి. ఈ రెండు జరగకుంటే మాత్రం బెంగళూరు కప్ కొట్టేందుకు సర్వశక్తులు ఒడ్డాల్సి వస్తుంది.
ఆర్సీబీ తుది జట్టు : ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(కెప్టెన్), లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, యశ్ దయాల్, హేజిల్‌వుడ్.
ఇంప్యాక్ట్ సబ్స్ : రసిక్ సలాం, మనోజ్ భండగే, టిమ్ సీఫర్ట్, స్వప్నిల్ సింగ్, సుయాశ్ శర్మ.
🚨 Toss 🚨@PunjabKingsIPL won the toss and elected to bowl first against @RCBTweets in the Grand #Final
Updates ▶ https://t.co/U5zvVhbXnQ#TATAIPL | #RCBvPBKS | #TheLastMile pic.twitter.com/OG9rob7n0U
— IndianPremierLeague (@IPL) June 3, 2025
పంజాబ్ తుది జట్టు : ప్రియాన్ష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైలీ జేమీసన్, విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్.
ఇంప్యాక్ట్ సబ్స్ : ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సుర్యాన్ష్ షెడ్గే, గ్జావియర్ బార్ట్లెట్, హర్‌ప్రీత్ బ్రార్.
తొలి కప్ కోసం 18 ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఆర్సీబీకి ఇది మంచి తరుణమనే చెప్పాలి. ఆరంభ సీజన్ నుంచి బెంగళూరు జట్టుకు పెద్దన్నలా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ కల సాకారం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ‘ఈ సాలా కప్ నమదే’ స్లోగన్‌తో ఈసారి మరింత రెచ్చిపోయి ఆడుతున్న కోహ్లీ, ఫిల్ సాల్ట్ భీకర ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు అతిపెద్ద బలం. ఇక మిడిల్ ఓవర్లలో రఫ్ఫాడించేందుకు రజత్ పాటిదార్, మయాంక్ అగర్వాల్, జితేశ్ శర్మ, లివింగ్‌స్టోన్‌లు ఉండనే ఉన్నారు.
Countdown’s 🔛. So is destiny ❤
Who will walk away as the 𝐍𝐞𝐰 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧 tonight? 🏆#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets | @PunjabKingsIPL pic.twitter.com/LOIImXfXpI
— IndianPremierLeague (@IPL) June 3, 2025
ఇక బౌలింగ్ యూనిట్లో జోష్ హేజిల్‌వుడ్ నిప్పులు చెరుగుతున్నాడు. క్వాలిఫయర్ 1లో అతడి ధాటికి పంజాబ్ టాపార్డర్ కకావికలమైంది. 21 పరుగులకే 3 కీలక వికెట్లు తీసిన ఈ స్పీడ్‌స్టర్ పంజాబ్ పతనాన్ని శాసించాడు. ఫైనల్లో కూడా అతడి నుంచే పంజాబ్ టాపార్డర్‌కు ముప్పు పొంచి ఉంది. లీగ్ దశలో ఓసారి, క్వాలిఫయర్ 1లో ఓసారి అయ్యర్‌ను ఔట్ చేసిన హేజిల్‌వుడ్ ఫైనల్లోనూ అదిరే ప్రదర్శన చేయాలని అనుకుంటున్నాడు.