Sunil Joshi : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌కు ముందు ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. పలు ఫ్రాంచైజీలు కోచింగ్ సిబ్బందిపై వేటు వేస్తుండగా.. కొందరు మాత్రం స్వచ్ఛందంగా వైదొలుగుతున్నారు. తాజాగా పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు కోచింగ్ సిబ్బందిలోని సునీల్ జోషీ (Sunil Joshi) షాకిచ్చాడు. వచ్చే సీజన్‌ను తాను అందుబాటులో ఉండడని చెప్పేశాడు. తాను ఫ్రాంచైజీని వీడుతున్నట్టు ఆదివారం పంజాబ్ యాజమాన్యానికి జోషి లేఖ రాశాడు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
‘పంతొమ్మిదో సీజన్‌కు తాను అందుబాటులో ఉండనని జోషీ లేఖ రాశాడు. అతడు మంచి వ్యక్తి. అతడితో ఫ్రాంచైజీకి మంచి అనుబంధం ఉంది. కానీ, అతడి నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. ఎవరి కెరీర్ వికాసానికి అయినా మేము అడ్డుపడం’ అని పంజాబ్ కింగ్స్ ప్రతినిధి ఒకరు క్రిక్‌బజ్‌తో వెల్లడించారు.
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
Punjab Kings’ spin bowling coach Sunil Joshi has stepped down from his role, and he is likely to join the BCCI’s Centre of Excellence (CoE) in Bengaluru! 🏏🇮🇳#PunjabKings #SunilJoshi #IPL #BCCI #Sportskeeda pic.twitter.com/9cQpsFxKEu
— Sportskeeda (@Sportskeeda) October 6, 2025
మాజీ స్పిన్నర్ అయిన జోషీ గత కొంత కాలంగా పంజాగ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. అనిల్ కుంబ్లే హెడ్‌కోచ్‌గా ఉన్నప్పుడు కూడా జోషీ ఫ్రాంచైజీతో కొనసాగాడు. పద్దెనిమిదో సీజన్లో రికీ పాంటింగ్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందిలో ఒకడిగా ఉన్నాడు. పంజాబ్ నుంచి వైదొలగుతున్న అతడు త్వరలోనే బీసీసీఐకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. భారత క్రికెటర్‌గా సునీల్ జోషీ కెరీర్ ఐదేళ్లు మాత్రమే. 1996 నుంచి 2021 మధ్య టీమిండియా జెర్సీ వేసుకున్న ఈ స్పిన్నర్ 15 టెస్టులు, 69 వన్డేలు ఆడాడు.
🚨⚡️JOSHI QUITS PBKS⚡️🚨
Punjab Kings spin bowling coach Sunil Joshi has stepped down from his role.
He will be joining the BCCI’s Centre of Excellence (CoE) in Bengaluru. [Cricbuzz]#IPL #PBKS #IPL2026 pic.twitter.com/vN6X5IG19O
— KG Sports (@TheKGSports) October 6, 2025