చెన్నై: ఐపీఎల్లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు అయిదు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ అద్భుతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడింది. దీంతో పంజాబ్ కెప్టెన్ అయ్యర్(Shreyas Iyer)కు జరిమానా విధించారు. 24 లక్షల ఫైన్ విధిస్తున్నట్లు ఐపీఎల్ పేర్కొన్నది. ఈ సీజన్లో రెండోసారి పంజాబ్ జట్టు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడింది. ఐపీఎల్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం పంజాబ్ కింగ్స్ తప్పిదం చేసినట్లు ఐపీఎల్ పేర్కొన్నది.
తన తొలి మ్యాచ్‌లో కూడా పంజాబ్ జట్టుకు స్లో ఓవర్ రేట్ కింద ఫైన్ పడింది. ఫస్ట్ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు 12 లక్షల జరిమానా విధించారు. ఇప్పుడు ఆ ఫైన్‌ను రెట్టింపు చేసి 24 లక్షల జరిమానా వేశారు. ఐపీఎల్ మీడియా అడ్వైజరీ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పింది. రెండో సారి తప్పు చేయడం వల్ల పంజాబ్ జట్టు మొత్తానికి ఫైన్ వేశారు. ఇంపాక్ట్ ప్లేయర్‌తో పాటు ఆటగాళ్లు అందరిపై ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించనున్నారు.