ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అరంగేట్రం చేయబోతున్న పంజాబ్ కింగ్స్ యువ బ్యాట్స్‌మన్ షారుక్ ఖాన్ నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నాడు. ఫోర్లు బాదడం కన్నా సిక్సర్లపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నాడు. తాజాగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో షారుక్ మైదానం నలువైపులా భారీ షాట్లు ఆడుతున్న వీడియోను పంజాబ్ పోస్ట్ చేసింది. షారుక్, మా కొత్త సిక్స్ హిట్టింగ్ మెషీన్..ఫోర్ కొట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడంటూ వ్యాఖ్యానించింది. ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు ఇది ట్రైలర్ మాత్రమే అన్నట్లు షార్ట్ వీడియో క్లిప్‌ను పంజాబ్ షేర్ చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో షారుక్‌ఖాన్‌ను పంజాబ్ రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో ఏప్రిల్ 12న ఆడనుంది.
📹 | Shahrukh, our new six-hitting machine doesn’t want to settle for a four! 😱#SaddaPunjab #PunjabKings #IPL2021 pic.twitter.com/jes3lTgUUL
— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2021