కోల్‌కతా: ఈ సీజన్లో అద్భుత ఆటతీరుతో దుమ్మురేపుతున్న పంజాబ్ కింగ్స్‌కు షాక్ తప్పేలా లేదు. ఆ జట్టు స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా రెండు బంతులు వేసిన ఫెర్గూసన్.. ఎడమ కాలి గాయంతో మైదానాన్ని వీడాడు.
కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు పంజాబ్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్ చివరి వరకు కూడా ఫెర్గూసన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి’.